అనంతపురం జిల్లాపై ఆధిపత్యం ఎవరిది: వైసీపీ-టీడీపీకి ఎన్నిసీట్లు?: లేటెస్ట్ సర్వే రిపోర్ట్
YS Jagan: ఏపీలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ బలహీన పడిందనుకున్న నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమిస్తోంది.
అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో పొత్తు సైతం పెట్టుకుంది. ప్రస్తుతం సీట్ల పంపకాల దశలో ఉంది ఈ రెండు పార్టీల పొత్తుల వ్యవహారం.

ఈ పరిణామాల మధ్య ఏపీ రాజకీయాలపై పొలిటికల్ క్రిటిక్ సంస్థ ఓ సర్వేను నిర్వహించింది. జిల్లాలవారీగా తన సర్వే ఫలితాలను విడుదల చేస్తోంది. ఇదివరకు తూర్పు గోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై చేపట్టిన సర్వే రిజల్ట్స్‌ను విడుదల చేసింది. ఈ ఏడు నియోజకవర్గాల్లో ఆరింట్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని అంచనా వేసింది.
తాజాగా అనంతపురం జిల్లాకు సంబంధించిన ఫలితాలను వెల్లడించిందా సంస్థ. అనంతపురం లోక్‌సభ జిల్లా నియోజకవర్గాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. హిందూపురం లోక్‌సభ పరిధిలోకి వచ్చే సత్యసాయి పుట్టపర్తి జిల్లా పరిధిలోని స్థానాలను ఈ జాబితాలో చేర్చలేదు.
#EarlyFindings
— Political Critic (@PCSurveysIndia) December 22, 2023
Anantapur district early findings
Rayadurg: Tight fight between YSRCP and TDP+, but Slight edge to YSRCP.
Uravakonda: Tight fight between YSRCP and TDP+ , but Slight edge to TDP+
Guntakal: Tight fight between YSRCP and TDP+ , but Slight edge to TDP+… pic.twitter.com/C5yShHd858
ఈ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం చూస్తే- అనంతపురం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ ఎనిమిదింట్లో చెరో నాలుగు స్థానాలను గెలుచుకుంటాయని పొలిటికల్ క్రిటిక్ అభిప్రాయపడింది.
రాయదుర్గం, సింగనమల, కల్యాణదుర్గం, రాప్తాడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, అనంతపురం అర్బన్ స్థానాలను తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని, పట్టణ ప్రాంతాల్లో టీడీపీ గట్టి పోటీ ఇస్తోందని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications