పొత్తులతో సీన్ రివర్స్, ఏపీలో ఆ పార్టీకే అధికారం - తేల్చేసిన ప్రముఖ సర్వే..!!

ఏపీలో ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది. ప్రధాన పార్టీల అభ్యర్దుల ప్రకటన తుది దశకు చేరుకుంది. ఇక హోరా హోరీగా ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు. గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఓటమే లక్ష్యంగా 2014 తరహాలో తిరిగి మూడు పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ సమయంలోనే ప్రముఖ సర్వే సంస్థ ఏపీలో ఎవరికి అధికారం దక్కుతుందనేది సర్వే చేసింది. పొత్తుల తరువాత ఏపీ లో మారుతున్న పరిస్థితులను వెల్లడించింది.

హోరా హోరీ
ఏపీలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. లోక్ సభ తో పాటుగా అసెంబ్లీకి జరగనున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు సిద్దమయ్యాయి. జగన్ ఓటమే లక్ష్యంగా జత కట్టిన టీడీపీ, జనసనతో బీజేపీ చేరింది. మూడు పార్టీలు సీట్లు సర్దుబాటు పైన ఒక నిర్ణయానికి వచ్చాయి. అటు జగన్ ఇప్పటికే అభ్యర్దుల పైన క్లారిటీ ఇచ్చినా ఈ నెల 16న ఇడుపుల పాయ వేదికగా తమ అభ్యర్దులను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సమయంలో ప్రముఖ రాజకీయ సర్వే సంస్థ పొలిటికల్ క్రిటిక్ ఏపీలో పొత్తుల తరువాత ప్రజాభిప్రాయం పైన సర్వే చేసింది. అందులో ఆసక్తి కర అంశాలను వెల్లడించింది. ఏపీలో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత మేర ప్రజా మద్దతు ఉందీ..ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అంచనా వేసింది.

Political Critic Survey predicts YCP stands in a strong position to secure another term in the 2024 elections

వైసీపీదే అధికారం
ఈ సంస్థ సర్వే ప్రకారం తిరిగి ఏపీలో వైసీపీ అధికారం రావటం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ 121 స్థానాలు, కూటమి 54 స్థానాలు గెలుస్తుందని అంచనా వేసింది. అయిదు సీట్లు ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయని వివరించింది. కాంగ్రెస్, ఇతరులకు ఒక్క స్థానం కూడా దక్కదని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 49.5 శాతం, కూటమికి శాతం, కాంగ్రెస్ కు 2.5 శాతం మద్దతు లభిస్తుందని విశ్లేషించింది. ఇతరులకు 5 శాతం వరకు ఉందని వివరించింది. అదే విధంగా ఎంపీ స్థానాల్లో వైసీపీ 19, కూటమి 6 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనాగా వెల్లడించింది. పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి 50.5 శాతం, కూటమికి 44 శాతం, కాంగ్రెస్ 3 శాతం, ఇతరులు 2.5 శాతం ఓట్లు సాధిస్తాయని విశ్లేషించింది. ఇక, వైసీపీ పట్టణ ప్రాంతంలో కొంత మేర బలహీనంగా ఉన్నా..గ్రామీణ స్థాయిలో బలంగా ఉందని విశ్లేషించింది.

ప్రజా మద్దతు
వైసీపీకి 55 నుంచి 60 శాతం మహిళా ఓటర్ల మద్దతు ఉందని ఈ సర్వేలో వివరించింది. సంక్షేమ పథకాల కొనసాగింపు కోరుకుంటున్న గ్రామీణ ఓటర్లు వైసీపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. పట్టణ ప్రాంతాల్లో వైసీపీ పైన వ్యతిరేకత ఉన్నా.. ఇంటి పట్టాలు, పథకాల ద్వారా కొంత మేర ఓట్ బ్యాంక్ గతం కంటే కొంత మెరుగైనట్లు విశ్లేషించారు. బీజేపీతో పొత్తు కారణంగా మైనార్టీ ఓట్ బ్యాంక్ వైసీపీ వైపు గతం కంటే బలంగా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని అంచనాగా వెల్లడించారు. రోడ్లు, ఇసుక, మద్య అంశాలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయని తేల్చింది. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా టీడీపీకి మద్దతుగా నిలచే ప్రధాన బీసీ వర్గాలను వైసీపీ తమ వైపు తిప్పుకొనేందుకు అమలు చేస్తున్న వ్యూహాలు ఫలితం ఇస్తున్నాయని సర్వే నివేదికలో విశ్లేషించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+