సీఎం జగన్ Vs చంద్రబాబు, అధికారం దక్కేదెవరికి - లేటెస్ట్ సర్వే రిపోర్ట్..!!

ఏపీలో ఎన్నికల పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. సీఎం జగన్ అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది. టీడీపీ, జనసేన వచ్చే నెల తొలి వారంలో తమ జాబితా విడుదల చేయనున్నారు. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి వస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ ఏపీలో కొత్త ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 27 నుంచి జగన్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ సమయంలోనే ఏపీలో అధికారం ఎవరికి దక్కుతందునే సర్వే నివేదికలు ఆసక్తి కరంగా మారాయి.

హోరా హోరీ: ఏపీలో ఈ సారి ఎన్నికల సమరం హోరా హోరీగా కనిపిస్తోంది. త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది. వైసీపీ సింగిల్ గా బరిలోకి దిగుతోంది. టీడీపీ, జనసేన కలిసి వస్తే బీజేపీ మూడు పార్టీలు కూటమిగా పోటీకి సిద్దం అవుతున్నాయి. కాంగ్రెస్ గతం కంటే బలం పెంచుకొనేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా, టీడీపీ - జనసేనకు మద్దతిస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

Political Critic Survey Predicts YSRCP retain power in next Elections, See deets

ఇక, జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. వచ్చే నెల నుంచి పవన్ వరుస పర్యటనలు ఖరారయ్యాయి. షర్మిల ఈ రోజు నుంచి రోజుకు మూడు జిల్లాల చొప్పున పర్యటనలు ప్రారంభిస్తున్నారు. ఈ సమయంలో పబ్లిక్ పల్స్ తెలుసుకొనేందుకు సర్వే సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

వైసీపీదే అధికారం: తాజాగా పొలిటికల్ క్రిటిక్ సర్వే సంస్థ ఏపీలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయనేది అంచనాలు వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన నివేదికల ప్రకారం వైసీపీకి 48 శాతం ఓటర్ల మద్దతు ఉందని పేర్కొంది. టీడీపీ +జనసేనకు 44 శాతం, బీజేపీకి 1.5 శాతం, కాంగ్రెస్ కు 1.5 శాతం, ఇతరులక 5 శాతం ఓట్లు పోలయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషించింది.

సీట్ల వారీగా వైసీపీకి 115 సీట్లు వరకు వస్తాయని వెల్లడంచింది. అదే విధంగా టీడీపీ + జనసేన పార్టీలకు 60 సీట్లు వరకు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ అంచనాల్లో అయిదు సీట్లు పెరుగుదల లేదా తగ్గుదల ఉండే అవకాశం ఉందని విశ్లేషించింది. ఇక, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి 17, టీడీపీ + జనసేనకు 8 సీట్లు వస్తాయని అంచనాగా వెల్లడించింది.

ప్రతిష్ఠాత్మక పోరు: ఇప్పటి వరకు మెజార్టీ సర్వే సంస్థలు ఏపీలో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఫలితాలను వెల్లడిస్తున్నాయి. టీడీపీ, జనసేన నేతలు మాత్రం వైసీపీ ప్రభుత్వం పైన ప్రజల్లో ఆగ్రహం ఉందని, తమ అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

జగన్ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. జగన్ తాను అమలు చేసిన సంక్షేమం - సామాజిక న్యాయం గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. వచ్చే నెల మూడో వారంలో ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో, ఇప్పుడు సర్వే సంస్థలు ఇస్తున్న నివేదికలు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+