Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రామోజీని గిల్లుతుంటే.. చంద్రబాబుకు నొప్పి ఎందుకు?

అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మన్ రామోజీ రావుపై ఏపీ సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసు, దర్యాప్తు వ్యవహారం.. రాజకీయ మలుపు తీసుకుంది. రామోజీ రావుకు నోటీసులను జారీ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పు పట్టింది. ఈ విషయంలో ఏకంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబే రంగంలోకి దిగారు. రామోజీ రావుకు మద్దతు ప్రకటించారు.

ఛిట్ ఫండ్ కార్యకలాపాల కోసం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది మార్గదర్శి చిట్స్ సంస్థ యాజమాన్యం. అవి నిజమని తేలడంతో సీఐడీ అధికారులు ఇదివరకే కేసు నమోదు చేశారు. మార్గదర్శి ఛిట్ ఫండ్స్ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఇందులో పొందుపరిచారు.

Political fray on twitter: YSRCP and TDP clash over Chandrababus backingofRamojiRao

చంద్రబాబు, టీడీపీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ.. రామోజీ రావుకు మద్దతుగా నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రామోజీ రావును అకారణంగా, ఉద్దేశపూరకంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఇరికించారనేది వారి వాదన. రామోజీ రావుకు తెలుగు ప్రజలందరూ అండగా ఉంటారని టీడీపీ చెప్పుకోవడం ఆశ్చర్య పరిచింది.

దీనిపై వైఎస్ఆర్సీపీ ఎదురుదాడికి దిగింది. టీడీపీని కార్నర్ చేస్తోంది. ప్రజల సొమ్మును ఇతర కంపెనీలకు బదలాయించిన రామోజీ రావుకు తెలుగు ప్రజలు అండగా ఉండటమేంటంటూ చురకలు వేసింది. సరైన సమయానికి డిపాజిట్ మొత్తాన్ని చెల్లించలేక చేతులెత్తుతున్న మార్గదర్శి యాజమాన్యానికి టీడీపీ సపోర్ట్ పలకడం హాస్యాస్పదమని పేర్కొంది.

రామోజీ రావు అక్రమాలపై ఏపీ సీఐడీ అధికారులు విచారణ జరుపుతోంటే.. చంద్రబాబు, టీడీపీ నేతలు ఎందుకు బాధపడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తోన్నారు. ఇది క్విడ్ ప్రోకో కాదా? అంటూ మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, చంద్రబాబును సీఎం చేయ‌డంలో అస‌లు విల‌న్ రామోజీరావేనని తేల్చి చెప్పారు.

రామోజీరావుకు అడ్డుగా ఉన్న వ్యాపార సంస్థ‌ల‌ను నాశ‌నం చేయ‌డంలో చంద్ర‌బాబు మెయిన్ విల‌న్‌‌గా అభివర్ణించారు. అందుకే వారిద్దరూ పరస్పరం ఇలా సహకరించుకుంటుంటారని ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌ల సొమ్మును దోచుకుంటున్న రామోజీరావు లాంటి వ్య‌క్తికి మ‌ద్ద‌తిస్తున్నారంటే ఆ సంస్థ అవినీతిలో టీడీపీకీ వాటా ఉందా? అని వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ ప్రశ్నించారు.

తనను తాను ఒక రాజ్యాంగేత‌ర శ‌క్తిగా ఊహించుకుంటూ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్స్‌ను రామోజీరావు నిర్వహిస్తోన్నాడని, ఇప్పుడు అందులో అక్ర‌మాల‌ను ఏపీ సీఐడీ బ‌య‌ట‌పెడుతుంటే మంచ‌మెక్కి సూక్తులు చెబుతున్నాడంటూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఆయ‌నను మించిన మ‌హాన‌టుడు ఎవ‌రుండరని చెప్పారు.

రామోజీ రావు ఏ1, చెరుకూరి శైలజా ఏ2గా కేసులు ఎదుర్కొంటోన్నారని విమర్శించారు. మంత్రులు సీదిరి అప్పల్రాజు, జోగి రమేష్, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..ఇలా పలువురు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు అటు టీడీపీ, ఇటు మార్గదర్శి యాజమాన్యంపై సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+