మెగా సినిమాపై చెర్రీ: చిరు రాజకీయాలపై పవన్ కళ్యాణ్?
హైదరాబాద్: తన రాజకీయ భవిష్యత్తుపై రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై చర్చించడానికి తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిరంజీవితో సమావేశమైనట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చిరంజీవి కాంగ్రెసుకు క్రమంగా దూరం జరుగుతున్నట్లు కూడా చెబుతున్నారు. ఆయన పార్టీ కార్యాలయానికి రావడం లేదని అంటున్నారు.
చిరంజీవి బిజెపి వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ చిరంజీవితో మాట్లాడినట్లు చెబుతున్నారు. జనసేన పార్టీ విషయంపై కూడా ఆయన మాట్లాడినట్లు చెబుతున్నారు. అయితే, చిరంజీవి మాత్రం ప్రస్తుతం తన 150 సినిమాను పూర్తి చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు.

చిరంజీవి సినిమాపై ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చిరంజీవి జన్మదినమైన ఆగస్టు 22వ తేదీన ఈ సినిమా ప్రారంభమవుతుందని తాజాగా అంటున్నారు. రామ్ చరణ్ తేజ స్వయంగా ఆ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ కూడా తండ్రితో పాటు ఆ సినిమాలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.
తమకు తగిన స్క్ర్పిప్టును పంపినవారికి కోటి రూపాయల నజరానా ఇస్తానని రామ్ చరణ్ అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని అంటున్నారు. ఇతర నటీనటులు తేలాల్సి ఉంది. సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా రామఅ చరణ్ తేజ జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications