కొడాలి నాని వీధి రౌడీల‌ను మించిపోయారు : క‌్ర‌మ‌శిక్ష‌ణ పార్టీ అందుకే మా మౌనం : అవినాశ్ ఫైర్‌..!

వైసిపి అధినేత జ‌గ‌న్‌..ష‌ర్మిళ‌..గుడివాడ వైసిపి అభ్య‌ర్ది కొడాలి నాని పై అదే నియోజ‌క‌వ‌ర్గం నుండి టిడిపి అభ్య‌ర్దిగా పోటీ లో ఉన్న దేవినేని అవినాశ్ తీవ్ర స్థాయి లో విరుచుకు పడ్డారు. చంద్ర‌బాబు పై ష‌ర్మిళ విమ‌ర్శ‌లు చేయ‌టం దారు ణం అన్నారు. కొడాలి నాని పైనా అవినాశ్ ఫైర్ అయ్యారు. ఒక ర‌కంగా హెచ్చ‌రించారు.

వారిది దిగ‌జారుడు త‌నం..

వారిది దిగ‌జారుడు త‌నం..

వైసిపి అధినేత జ‌గ‌న్ ..సోదరి షర్మిలపై గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా 40 ఏళ్లు అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని షర్మిల విమర్శించడం దారుణం అన్నారు. చెప్పు కునేందకు ఏమీ లేకనే చంద్రబాబుపై జగన్, షర్మిల విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. జగన్, షర్మిల చేస్తు న్న విమర్శలు వారి దిగజారుడుతనానికి నిదర్శనం అని పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం లో ష‌ర్మిల ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఆ స‌భ‌లో ష‌ర్మిళ చంద్ర‌బాబు..లోకేష్ పై విమ‌ర్శ‌లు చేసారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం దేవినేని నెహ్రూ పైనా ఆరోప‌ణ‌లు చేసారు. వంగ‌వీటి రాధా గురించి ప్ర‌స్తావించారు. ఇక‌, ఇప్పుడు దేవినేని అవినాశ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో గుడివాడ లో రాజ‌కీయాలు మ‌రింత హీట్ పుట్టిస్తున్నాయి.

వీధి రౌడీని మించిపోయిన నాని..

వీధి రౌడీని మించిపోయిన నాని..

అవినాశ్ త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధి..వైసిపి అభ్య‌ర్ది కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేసారు.గుడివాడలో కొడాలి నాని వీధి రౌడీలను మించిపోయి అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ కావడంతోనే తాము మౌనగా ఉన్నామన్నారు. గుడివాడలో వైసీపీ ఓటమి ఖాయం అని తేలడంతోనే అరాచకాలు సృష్టించేలా నాని విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వంగ‌వీటి రంగా హ‌త్య కేసు గురించి కొడాలి నాని ప్ర‌స్తావించం.. అందులో దేవినేని నెహ్రూ ప్ర‌మేయం ఉంద‌ని వ్యాఖ్యానించ‌టం మంగ‌ళ‌వారం నాటి స‌భ‌లో క‌ల‌క‌లం సృష్టించాయి. దీనికి ప్ర‌తి గా ఇప్పుడు దేవినేని అవినాశ్ సైతం కొడాలి నాని వీధి రౌడీగా పేర్కొన‌టం.. వీరిద్ద‌రి మ‌ధ్య పోరు మ‌రింత కీల‌కంగా మారుతోంది.

ఇద్ద‌రు అధినేత‌ల‌కు కీల‌కంగా..

ఇద్ద‌రు అధినేత‌ల‌కు కీల‌కంగా..

ఇక‌, గుడివాడ లో గెలుపు అక్క‌డి అభ్య‌ర్దుల‌కే కాదు..రెండు పార్టీల అధినేత‌ల‌కు కీల‌కంగా మారింది. ఎలాగైనా కొడాలి నాని ని ఓడించాల‌నే ల‌క్ష్యంతో చంద్ర‌బాబు స్థానిక టిడిపి నేత‌ల‌ను కాద‌ని..ఏరి కోరి దేవినేని అవినాశ్ ను ఎంపిక చేసా రు. ఇప్ప‌టికే గుడివాడ లో చంద్ర‌బాబు ప‌ర్య‌టించి..తిన్నింటి వాసాలు లెక్క‌పెట్టే ర‌కంగా కొడాలి నానిని అభివ‌ర్ణించా రు. ఇక‌, అవినాశ్ ను గెలిపించాల్సిన బాధ్య‌త పార్టీ నేత‌లు సీరియ‌స్ గా తీసుకోవాల‌ని ఆదేశించారు. ఇక‌, ఇటు వైసిపి లో సైతం కొడాలి నాని గెలుపు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటున్నారు. కొడాలి నాని నంద‌మూరి కుటుంబానికి స‌న్నిహిత సంబంధాలు ఉన్న వ్య‌క్తి కావం..చంద్ర‌బాబు పై విరుచుకు ప‌డే వ్య‌క్తిత్వం కావ‌టంతో నాని ఎలాగైనా గెల‌వాల‌ని జ‌గ‌న్ కోరుతున్నారు. దీని కోసం జ‌గ‌న్ సైతం గుడివాడ లో ప్ర‌చారానికి రానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+