శ్రీహరి: ఏడుపు ఆపుకోలేకపోయిన జయసుధ (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు రియల్ స్టార్ శ్రీహరి హఠాన్మరణం సినీ పరిశ్రమతో పాటు రాజకీయ పరిశ్రమను కూడా షాక్‌కు గురి చేసింది. శ్రీహరి గతంలో యువజన కాంగ్రెసు పార్టీలో పని చేశారు. ఆ తర్వాత సిని పరిశ్రమ వైపుకు వెళ్లారు. చిన్న చిన్న పాత్రలు పోషించే స్థాయి నుండి హీరో వరకు ఎదిగారు. అంతేకాకుండా ఇటీవల ఆయనను దృష్టిలో పెట్టుకొనే క్యారెక్టర్ కొన్ని పాత్రలు సృష్టించారు.
మగధీర, నువ్వొస్తానంటే నేనొద్దంటానా తదితర చిత్రాల్లో హీరోలకు ధీటుగా శ్రీహరి కనిపించారు. సామాజిక సేవ చేస్తున్న శ్రీహరికి ఇటీవల రాజకీయాల వైపు దృష్టి మళ్లింది. దీంతో 2014 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని మొదట ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీ వైపు అడుగు వేశారు.
అయితే పార్టీలకతీతంగా శ్రీహరి అంటే అందరికీ అభిమానమే. శ్రీహరి భౌతిక కాయాన్ని గురువారం ఉదయం ఆయన నివాసానికి తీసుకు వచ్చారు. సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. వి హనుమంత రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కె కేశవ రావు, లక్ష్మీ పార్వతి, దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్ వంటి వారు నివాళులు అర్పించారు.

అంజన్ కుమార్ యాదవ్
నటుడు రియల్ స్టార్ శ్రీహరికి నివాళులు అర్పించేందుకు వచ్చిన సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్, ఆయన తనయుడు.

వి హనుమంత రావు
నటుడు రియల్ స్టార్ శ్రీహరికి నివాళులు అర్పించేందుకు వచ్చిన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు.

లక్ష్మీ పార్వతి 1
నటుడు రియల్ స్టార్ శ్రీహరికి నివాళులు అర్పించేందుకు వచ్చిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి.

లక్ష్మీ పార్వతి 2
నటుడు రియల్ స్టార్ శ్రీహరికి నివాళులు అర్పించేందుకు వచ్చిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి. శ్రీహరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీయో, మినిస్టరో అయి ఉండే వారని ఆమె అన్నారు.

జయసుధ
మృతి చెందిన నటుడు రియల్ స్టార్ శ్రీహరి భౌతిక కాయాన్ని చూసి ఏడ్పు ఆపుకోలేకపోయిన సికింద్రాబాద్ శాసన సభ్యురాలు జయసుధ.

విహెచ్
నటుడు రియల్ స్టార్ శ్రీహరికి నివాళులు అర్పించేందుకు వచ్చిన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు.

కృష్ణం రాజు
నటుడు రియల్ స్టార్ శ్రీహరికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి 'రెబల్ స్టార్' కృష్ణం రాజు. చిత్రంలో శాంతి ఉన్నారు.

మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న
రియల్ స్టార్ శ్రీహరి మృతదేహాన్ని చూసి కన్నీరు కార్చుతున్న ప్రముఖ నటి, నిర్మాత లక్ష్మీ ప్రసన్న. పక్కన మోహన్ బాబు, ఆయన తనయుడు నివాళులు.

జయసుధ
నటుడు రియల్ స్టార్ శ్రీహరి భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు వస్తున్న సికింద్రాబాద్ శాసన సభ్యురాలు, నటి
జయసుధ.

ఎన్టీఆర్
నటుడు శ్రీహరి మృతదేహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన సతీమణి శాంతిని ఓదార్చుతున్న హీరో
జూనియర్ ఎన్టీఆర్.

చిరంజీవి
శ్రీహరికి నివాళులు అర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, పక్కన
ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ.












Click it and Unblock the Notifications