టీ పోసి, కట్లెట్ చేశారు: ప్రచార సిత్రాలు (పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలో అన్ని పార్టీల నాయకులు తమ ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ తిరిగి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలతోపాటు సిపిఐ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు, నాయకులు విస్తృతంగా పర్యటిస్తున్నారు.

వాడవాడలా.. ఇంటింటికీ తిరుగుతూ తమ పార్టీ అభ్యర్తికే ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు టీ అమ్మితే.. పలువురు నాయకులు కూరగాయాలు అమ్ముతూ ఆకట్టుకున్నారు. తమ తమ పార్టీ గుర్తులను చూపిస్తూ.. నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు కురిపిస్తూనే.. తమ పార్టీకి ఓటేస్తే మంచి పాలన అందిస్తామని చెబుతున్నారు. ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటామని ప్రజలకు హామీలు ఇస్తున్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్, టిడిపి,బిజెపి నాయకులు నగరంలో ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నారు.

టిడిపి ప్రచారం

టిడిపి ప్రచారం

హైదరాబాద్ నగరంలో అన్ని పార్టీల నాయకులు తమ ప్రచారంతో దూసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య, నాయకులు దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యం.

సిపిఐ ప్రచారం

సిపిఐ ప్రచారం

హైదరాబాద్ నగరంలోని మహేశ్వరంలో తమ పార్టీని గెలిపించాలంటూ ప్రచారం నిర్వహిస్తున్న సిపిఐ పార్టీ నాయకులు అజీజ్ పాషా.

సిపిఐ ర్యాలీ..

సిపిఐ ర్యాలీ..

హైదరాబాద్ నగరంలోని మహేశ్వరంలో తమ పార్టీని గెలిపించాలంటూ ర్యాలీ నిర్వహిస్తున్న సిపిఐ నాయకులు, కార్యకర్తలు.

టిఆర్ఎస్ కట్లెట్

టిఆర్ఎస్ కట్లెట్

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కట్లెట్ సెంటర్‌లో సందడి చేస్తున్న దృశ్యం.

సుధీర్ రెడ్డి ప్రచారం

సుధీర్ రెడ్డి ప్రచారం

ఎల్‌బి‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యం.

కూరగాయలు విక్రయిస్తూ..

కూరగాయలు విక్రయిస్తూ..

తమ ప్రచారంలో భాగంగా దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో కూరగాయలు అమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.

దరువేస్తూ..

దరువేస్తూ..

పార్టీ ప్రచారంలో భాగంగా దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో దరువేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు.

టిడిపి అభ్యర్థి ఆర్ కృష్ణయ్యతో..

టిడిపి అభ్యర్థి ఆర్ కృష్ణయ్యతో..

ప్రచారంలో కలిసిన ఎల్‌బినగర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్ కృష్ణయ్యతో టిఆర్ఎస్ పార్టీ నాయకులు.

ఛాయ్ తాగండి- ఓటేయండి

ఛాయ్ తాగండి- ఓటేయండి

దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్న ఎల్‌బి‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఓ టీ స్టాల్‌లో ఛాయ్ పోస్తున్న దృశ్యం.

కారు జోరు

కారు జోరు

దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.

మాకే మీ ఓటు

మాకే మీ ఓటు

ప్రచారంలో భాగంగా తమకే ఓటు వేయాలని మహిళను అభ్యర్థిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు సాయన్న.

రిక్షాపై ప్రచారం

రిక్షాపై ప్రచారం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంనగర్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తమకే ఓటువేయాలని ఓటర్లను అభ్యర్థించారు.

టిడిపి-బిజెపి ప్రచారం

టిడిపి-బిజెపి ప్రచారం

మాల్కాజ్‌గిరి లోకసభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్థి మల్లారెడ్డి, బిజెపి నాయకుల ప్రచారం.

మల్లారెడ్డి వెనక ఎన్టీఆర్ వేషధారి

మల్లారెడ్డి వెనక ఎన్టీఆర్ వేషధారి

మాల్కాజ్‌గిరి లోకసభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్థి మల్లారెడ్డి, బిజెపి నాయకుల ప్రచారం. వారితోపాటు ఎన్టీఆర్‌లా ఉన్న వ్యక్తి ఆకట్టుకున్నారు.

నాకే మీ ఓటు

నాకే మీ ఓటు

అంబర్‌పేట అసెంబ్లీ నియోజక వర్గానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యం.

టిఆర్ఎస్ ప్రచారం

టిఆర్ఎస్ ప్రచారం

చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు.

కెసిఆర్ సభ కోసం..

కెసిఆర్ సభ కోసం..

టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో మైదానం చదును చేస్తున్న మల్కాజ్‌గిరి అభ్యర్థి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+