పార్టీలకు సెగ: ఫ్యాన్ విరిచేశారు, చెట్టెక్కి బెదిరించాడు

హైదరాబాద్: టికెట్లు లభించనివారి నుంచి, వారి అనుచరుల నుంచి రాజకీయ పార్టీలు తీవ్ర అసంతృప్తిని చవి చూస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కార్యకర్తల నుంచి అసమ్మతిని, ఆందోళనలను ఎదుర్కుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి వైఖరికి నిరసనగా యడవల్లి కృష్ణ వర్గీయులు ఖమ్మంలో ఆందోళన చేపట్టారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత వనమా వెంకటేశ్వరరావు వైసీపీలో చేరడంపై కొత్తగూడెంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎప్పటి నుంచి పార్టీని నమ్ముకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చినవారికి టికెట్ ఎలా ఇస్తారని వారు మండిపడ్డారు. కొత్తగూడెం నుంచి వైసీపీ టిక్కెట్ ఆశిస్తున్న యెడవల్లి కృష్ణ వర్గీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుర్తు ఫ్యాన్ రెక్కలు విరిచి తమ నిరసన తెలియజేశారు. ఫ్లెక్సీలను చించివేశారు. డబ్బుల కోసమే వనమాను పార్టీలో చేర్చుకున్నారని జగన్‌పై యడవల్లి కృష్ణ వర్గీయులు మండిపడ్డారు.

political parties witness protest

ఇదిలావుంటే, కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ రాని అభ్యర్థులు, వారి అనుచరులు మంగళవారం నాడు గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసుల అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపునకు యత్నించారు.

మరోవైపు, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంటి వవద్ద జడ్చర్ల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మల్లు రవికి టికెట్ ఇవ్వడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేష్ రెడ్డికి జడ్చర్ల టికెట్ ఇవ్వాలని వారు నినాదాలు చేశారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా నిరసనలను చవి చూస్తోంది. నర్సాపూర్‌కు చెందిన శ్రీశైలం అనే దళిత వ్యక్తి తెరాస భవన్ దగ్గర హంగామా చేశాడు. తన కుమారుడికి టికెట్ కేటాయించాలని కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతను చెట్టు ఎక్కి కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు, కార్యకర్తలుకలిసి శ్రీశైలంను అడ్డుకున్నారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసం వద్ద పార్టీ రేవంత్‌రెడ్డి మిత్రమండలి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. మల్కాజ్‌గిరి సీటును రేవంత్‌రెడ్డి ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. బిజెపి, టిడిపి పొత్తులతో టికెట్లు దక్కని నేతల అనుచరులు కూడా ఆందోళనకు దిగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+