హిందూపురంలో బాలయ్యకు పనిచేస్తున్న వైసీపీ?
రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం ఒకటి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు విజయం సాధించలేదు. 2014 ఎన్నికల్లో ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ నందమూరి బాలకృష్ణ ఇక్కడి నుంచి పోటీచేసి ఘనవిజయం సాధించారు.
2019లో వైఎస్ జగన్ గాలిని తట్టుకొని మరీ గెలుపు సాధించి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపించారు. అయితే తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలను రాబోయే ఎన్నికల్లో ఓడించేందుకు ముఖ్యమంత్రి జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా హిందూపురం నుంచి బాలయ్యను ఓడించేందుకు ఈసారి మహిళా అభ్యర్థి దీపికను రంగంలోకి దించారు.

భర్త రెడ్డి సామాజికవర్గానికి చెందినవారుకాగా, ఆమె బీసీ వర్గానికి చెందినవారు. ఇక్కడ దీపికను గెలిపించి బాలయ్యను ఓడించే బాధ్యతను జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కట్టబెట్టారు. దీంతో ఆయన తాను పోటీచేస్తున్న పుంగనూరు నియోజకవర్గంకన్నా హిందూపురంపైనే ఎక్కువ దృష్టిసారించారు.
మండలాలవారీగా ద్వితీయ శ్రేణి నాయకులను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. అయితే నియోజకవర్గంలోని వైసీపీ గ్రూపుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. 2014లో నవీన్ నిశ్చల్, 2019లో మహ్మద్ ఇక్బాల్ పోటీచేశారు. 2024 ఎన్నికల్లో పోటీచేయడానికి వీరే కాకుండా ఎంతోమంది నేతలు టికెట్ ఆశించారు. చివరకు దీపికకు దక్కింది.
ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీతోపాటు మరికొందరు నాయకులు ఒకరికి తెలియకుండా మరొకరు రాజకీయాలు చేస్తున్నారంటూ స్థానిక వైసీపీ శ్రేణులు వాపోతున్నాయి. ప్రస్తుతం దీపికకు వీరెవరూ సహకరించడంలేదు. రాజకీయంగా నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం వైసీపీ కీలక నేత హత్య జరిగింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
రాజకీయం ఇలాగే కొనసాగితే బాలకృష్ణకు మెజారిటీ పెరుగుతుందేకానీ తగ్గదని స్థానిక వైసీపీ శ్రేణులే బహిరంగంగా చెబుతున్నాయి. ఈ ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పని ఒక్కటి కూడా జరగలేదని టీడీపీ ప్రచారం చేస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో బాలకృష్ణ హిందూపురంకు నీటి సౌకర్యం కల్పించారు. అదే ఆయనకు గత ఎన్నికల్లోను, ఈ ఎన్నికల్లోను వరంగా మారుతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications