• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీడియా పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం ... ఎందుకంటే

|

మీడియానే వాడుకుని ఎదిగిన ప్రశాంత్ కిషోర్ కు ఇప్పుడు మీడియానే సమస్యగా మారిందా ? రాజకీయ వ్యూహకర్తగా రాజకీయ పార్టీలకు మీడియాను , సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మీడియా విషయంలో ఇబ్బంది పడుతున్నారా ? వైయస్ జగన్ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించిన పీకే ఇప్పుడు మీడియా పైనే మండిపడే పరిస్థితి ఎందుకొచ్చింది తెలుసుకోవాలంటే ఈ వార్త చదవండి.

కేసీఆర్ తరహాలో జగన్ ఆ నిర్ణయం తీసుకుంటారా ? రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తారా ?

 రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ .. మీడియాను, సోషల్ మీడియాను వాడటంలో దిట్ట

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ .. మీడియాను, సోషల్ మీడియాను వాడటంలో దిట్ట

ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా రాజకీయ వ్యూహకర్తగా మంచి పేరు సంపాదించిన వ్యక్తి . గతంలో బీజేపీ కి పనిచేసి కేంద్రంలో బీజేపీ కి అధికారం అందించటంలో తోడ్పాటును అందించారని గుర్తించి ఏపీలో జగన్ ఏరికోరి ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా ఎంచుకొని తమ పార్టీ కోసం పని చేసేలా చేశారు. సోషల్ మీడియా లో ప్రశాంత్ కిషోర్ వైసీపీ ప్రభావం ప్రజల మనస్సులో పడేలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఏపీలో విజయ బావుటా ఎగురవేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు . ఎన్నికల తర్వాత కూడా వైసీపీ అధికారంలోకి వస్తే ప్రశాంత్ కిషోర్ అప్పుడు కూడా తమతో కలిసి పనిచేయాలని జగన్ కోరినట్లు వార్తలు వచ్చాయి అయితే ఈ విషయంలో క్లారిటీ లేదు.

 పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ కి పని చేయనున్న ప్రశాంత్ కిషోర్

పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ కి పని చేయనున్న ప్రశాంత్ కిషోర్

ఏపీలో జగన్ ప్రభుత్వ అధికారం చేపట్టాక ఇప్పటివరకు పీకే రోల్ ఏ మాత్రం కనిపించలేదు. అయితే ఆయన ప్రస్తుతం పని ఎక్కడ పని చేస్తున్నారు అన్న దానిపైన రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి . మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అసహనానికి గురవుతూ మీడియా పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈయన ఐపాక్‌ పేరుతో ఓ టీమ్ ను నడుపుతున్నారు. రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్ కోసం పనిచేయనున్నారు.

అయితే తాజాగా ఈ దిగ్గజ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ మరెక్కడో పని చేస్తున్నారంటూ వచ్చిన వార్తలపై , సదరు మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు.

 తానూ ఎక్కడ పని చేస్తున్నానో రోజుకో వార్తలు రాస్తున్న మీడియా పై ఆయన మండిపాటు

తానూ ఎక్కడ పని చేస్తున్నానో రోజుకో వార్తలు రాస్తున్న మీడియా పై ఆయన మండిపాటు

ప్రశాంత్‌ కిషోర్‌ మీడియా, వార్తా పత్రికలపై మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన శివసేన యువనేత ఆదిత్య ఠాక్రేతో కలిసి పనిచేస్తున్నారని ఓ పత్రిక వార్త రావడంతో ఆ వార్తను ఉద్దేశిస్తూ ప్రశాంత్‌ కిషోర్ మాట్లాడారు. తనకు మీడియా అంటే ఎంతో గౌరవం ఉందని, ఇలాంటి వార్తల గురించి విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘నిజం చెప్పాలంటే ఈ మధ్య నేను ఎక్కడ పనిచేస్తున్నానో నాకంటే బాగా మీడియాకే తెలుస్తోంది. నేనెక్కడ పని చేస్తున్నానో నేనే వార్తా పత్రికల్లో చదవి తెలుసుకోవాల్సి వస్తోంది' అని చాలా వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. మీడియా పట్ల తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

English summary
Prashant Kishore is furious at the media and newspapers. A news paper published the news that He is currently working with Shiv Sena youth Aditya Thackeray. About the fake news he responded that He has a lot of respect for the media and he is very sad to hear about such news. On this occasion he said… 'The truth is that the media is better known than where I work.I have been reading in the news papers and realising that where I am working. He expressed his outrage at the media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more