కేసీఆర్ పై పేర్ని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు - తెలంగాణలో రాజకీయ శూన్యత : రేవంత్ పైనా సెటైర్లు..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఏపీ మంత్రి పేర్ని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో పార్టీ పెట్టమని కోరుతున్నారంటూ టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పైన మంత్రి పేర్ని నాని రియాక్షన్ రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. తాము కూడా పార్టీ పెట్టమనే కోరుతున్నామని చెబుతూనే...రెండు రాష్ట్రాల్లో ఒకటే పార్టీ ...రెండు రాష్ట్రాల్లో కలిపేస్తూ కేబినెట్ లో తీర్మానం చేస్తే సరి పోతుందని..తమ నాయకుడు సైతం రాష్ట్రం కలిసే ఉండాలని కోరుకున్నారంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ మాట తప్పారంటూ
ఇక, తాజాగా.. కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. నదీ జలాల వినియోగం విషయంలో కేసీఆర్ మాట తప్పారన్నారు. దిండి, పాలమూరు వంటి ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు నీళ్లు మళ్ళించారని చెప్పుకొచ్చారు. ఏపీకి కేటాయించిన నీళ్లకు అదనంగా చెంచాడు నీళ్లు కూడా వాడమని ఎప్పుడో చెప్పామని గుర్తు చేసారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ కు ఎంత దూరమో విజయవాడ నుంచి హైదరాబాద్ కు అంతే దూరం అంటూ కీలక వ్యాఖ్య చేసారు.

తెలంగాణలో రాజకీయ శూన్యత
అదే సమయంలో తెలంగాణలోని రాజకీయాల పైన స్పందించారు. రాజకీయ శూన్యత వల్లే తెలంగాణలో కొత్త పార్టీలు పుట్టుకు వస్తున్నాయన్నారు. అదే సమయంలో 151 స్థానాలు వచ్చిన తర్వాత ఏపీలో శూన్యత ఎక్కడ ఉంటుందంటూ ప్రశ్నించారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ప్రజల మనసుల్లో శూన్యత లేదని వ్యాఖ్యానించారు. ఇక, పేర్ని నాని తెలంగాణను ఏపీలో కలిపేయండంటూ చేసిన వ్యాఖ్యల మీద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. దీని పైన ఆయన ట్వీట్ చేసారు.

రేవంత్ కు రాజకీయాలు రావాలి
రేవంత్ ట్వీట్ పైన స్పందించిన మంత్రి నాని.. రోజు రాజకీయాల్లో ఉండలనుకునే వారు అలాగే మాట్లాడతారని చెప్పుకొచ్చారు. రేవంత్ కు రోజు రాజకీయాలు కావాలన్నారు. తమ నాయకుడు జగన్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారంటూ మంత్రి నాని చెప్పారు. గతంలో నీటి ప్రాజెక్టు వ్యవహారంలో తెలంగాణ నేతలు ముఖ్యమంత్రి జగన్.. తండ్రి వైఎస్సార్ పైన వ్యాఖ్యలు చేసినా వైసీపీ నేతలు పెద్దగా రియాక్ట్ కాలేదు. తమ విధానం మాత్రమే చెబుతూ వచ్చారు.

కేసీఆర్ పైన దుకుడు పెంచటం వెనుక
అయితే, ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. కానీ, ఇప్పుడు కొంత గ్యాప్ కనిపిస్తోంది. ఇక, మంత్రి పేర్ని నాని అవకాశం వచ్చిన ప్రతీ సందర్బంలోనూ తమ పైన చేసిన వ్యాఖ్యలను తిప్పి కొడుతున్నారు. ఇక, ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైన టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications