• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్ర‌బాబు అడ్డంగా దొరికేసారా : జ‌గ‌న్ ను మించిపోయేలా కేసీఆర్ : వార్ బిగిన్స్‌..!

|

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాజ‌కీయంగా అడ్డంగా దొరికేసారా. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేతికి అస్త్రాల‌ను అందించారా. కేసీఆర్ ఇంత‌లా ఎందుకు చంద్ర‌బాబును టార్గెట్ చేస్తున్నారు. విప‌క్ష నేత జ‌గ‌న్ ను మించిపోయేలా కేసీఆర్..చంద్ర‌బాబు పై విరుచుకుప‌డుతున్నారు. చంద్ర‌బాబు కు బ్ర‌హ్మాండ‌మైన రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తామ‌ని కేసీఆర్ మ‌రో సారి ప్ర‌క‌టించారు. దీంతో..ఇద్ద‌రు చంద్రుల మ‌ధ్య అస‌లైన పొలిటిక‌ల్ వార్ ఇక మొద‌లైన‌ట్లేనా..

ప్ర‌త్యేక హోదా పై చంద్ర‌బాబు సెల్ఫ్ గోల్..!

ప్ర‌త్యేక హోదా పై చంద్ర‌బాబు సెల్ఫ్ గోల్..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్...ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై చెల‌రేగిపోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపి లో చంద్ర బాబు పాల‌న పై జ‌గ‌న్ నిత్యం విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పాద‌యాత్ర‌లోనూ బాబు మోసాలు చేస్తున్నారంటూ ఫైర్ అవుతు న్నారు. అయితే,ఇప్పుడు కేసీఆర్ ఒకే ఒక్క ప్రెస్ మీట్ ద్వారా చంద్ర‌బాబు పై విరుచుకుప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపికి ప్ర‌త్యేక హోదా కు అడ్డుప‌డుతున్న కేసీఆర్ కు ఎలా మ‌ద్ద‌తిస్తార‌ని జ‌గ‌న్ -ప‌వ‌న్ ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మొద‌లు టిడిపి నేత‌లు ప్ర‌శ్నిస్తూ వ‌చ్చారు. అయితే, దీని పై కేసీఆర్ చాలా స్ప‌ష్ట‌మైన స‌మాధానం ఇచ్చారు. త‌మ పార్టీ నేత‌లు పార్ల‌మెంట్ లోని ఉభ‌య స‌భ‌ల్లో ఏపికి హోదా ఇవ్వ‌మ‌ని డిమాండ్ చేసార‌ని కేసీఆర్ గుర్తు చేసారు. తాను సైతం ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం లేఖ రాస్తాన‌ని ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు అబ‌ద్దాల‌తో రాజ‌కీయాలు చేస్తార‌ని..డబ్బా కొట్టుకుంటార ని ..నిజాలు చెప్ప‌రంటూ కేసీఆర్ చంద్ర‌బాబు పై ఫైర్ అయ్యారు.. హోదా విష‌యంలో చంద్ర‌బాబు కు అస‌లు క్లారిటీ లేద‌ని విమ‌ర్శించారు.

నాలుగేళ్లు బిజెపి ది..ఇప్పుడు రాహుల్ ది..

నాలుగేళ్లు బిజెపి ది..ఇప్పుడు రాహుల్ ది..

కేసిఆర్ త‌న ప్రెస్‌మీట్ లో అంశాల వారీగా రియాక్ట్ అయ్యారు. 14వ ఆర్దిక సంఘం ఏపికి 24వేల కోట్లు ప్ర‌త్యేక ఆర్దిక స‌హా యం కోసం రికమెండ్ చేసింద‌ని..అది కేంద్రం య‌ధాత‌ధంగా అమ‌లు చేస్తుంద‌ని కేసీఆర్ వివ‌రించారు. ఇక‌, రాజ‌ధాని కోసం కేంద్రం 1500 కోట్లు ఇచ్చింద‌ని..హైకోర్టు నిర్మాణం కోసం 500 కోట్లు మంజూరు చేసింద‌ని..కానీ, కేంద్ర ప్ర‌భుత్వం పై చంద్ర‌బాబు అబ‌ద్దాలు చెబుతున్నార‌ని విమ‌ర్శించారు. నాలుగేళ్ల పాటు బిజెపిది.. ఇప్పుడు రాహుల్ ది అంటూ త‌న‌దైన శైలిలో చంద్ర‌బాబు పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. చంద్ర‌బాబు త‌న మామ పార్టీని లాక్కున్నార‌నిన‌.. ఆయ‌న లీడ‌ర్ కాద‌ని..మేనేజ‌ర్ అంటూ వ్యాఖ్యానించారు. ఏపిలో విచ్చ‌ల‌విడి అవినీతి ఉంద‌ని..అటువంటి డ‌ర్టీ పొలి టిషియ‌న్ ను భ‌రిస్తున్న ఏపి ప్ర‌జ‌ల‌కు మొక్కాల‌ని పేర్కొన్నారు. సైబ‌రాబాద్ గొప్ప‌త‌నం చంద్ర‌బాబు ది కాద‌ని..అక్క డ ట‌వ‌ర్స్ కు శంకుస్థాప‌న చేసింది నేదురుమ‌ల్లి జ‌నార్ధ‌న‌రెడ్డి అని గుర్తు చేసారు. తాము పెట్టిన ప‌ధ‌కాల‌ను కాపీ కొట్టి.. త‌మ ప‌ధ‌కాలుగా ప్ర‌చారం చేసుకుంటున్న‌రన్నారు. ఇంగ్లీషు - హిందీ మాట్లాడ‌టం రాని చంద్ర‌బాబు జాతీయ రాజ‌కీ యాల్లో చ‌క్రం తిప్పేది లేదు..తిరిగేది లేదూ అంటూ ఫైర్ అయ్యారు.

వార్ బిగిన్స్..ఎవ‌రికి మేలు చేస్తుంది...

ఇక‌, ఇద్ద‌రు చంద్రుల మ‌ధ్య రాజ‌కీయ యుద్దం తారాస్థాయికి చేరింది. ఏపికి హోదా వ‌ద్ద‌ని కేసీఆర్ అడ్డుప‌డుతున్నార ని చంద్ర‌బాబు విమ‌ర్శిస్తే..అస‌లు హోదాకు బాబు అడ్డు అని కేసీఆర్ ప్ర‌తి విమ‌ర్శ చేసారు. ఇక‌, ఏపిలో జ‌రుగుతున్న అవినీతి గురించి..జాతీయ స్థాయిలో చంద్ర‌బాబు పై ఇత‌ర పార్టీల నేత‌ల వ్యాఖ్య‌ల గురించి ప‌దే ప‌దే కేసీఆర్ ప్ర‌స్తావి స్తున్నారు. కేసీఆర్ ను బూచి గా చూపి..సెంటిమెంట్ పండించాల‌ని టిడిపి నేత‌లు భావిస్తుంటే..కేసీఆర్ చేసిన వ్యాఖ్య లతో ఒక ర‌కంగా ఇప్పుడు టిడిపి స‌మాధానం చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఏపి లో అవినీతి..ప్ర‌క‌ట‌న‌టు..డబ్బా కొట్టుకుంటున్నార‌ని తీవ్రంగా ఆరోపించారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో భాగంగా..వామ‌ప‌క్షాల‌తో పాటుగా జ‌గ‌న్ వ‌చ్చినా స్వాగ తిస్తామ‌ని..చంద్ర‌బాబు లాంటి వారు త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించారు. స‌చివాల‌య ట‌వ‌ర్ల కోసం ర్యాఫ్ట్ ఫౌం డేష‌న్ అనేది గొప్ప‌గా ప్ర‌చారం చేస్తున్నార‌ని..రేగడి భూముల్లో ర్యాఫ్ట్ ఫౌండేష‌న్ ఎప్ప‌టి నుండో ఉంద‌ని వివ‌రించారు. ఇక‌, స‌చివాల‌యం..అసెంబ్లీ నిర్మాణాల గురించి గొప్ప‌గా చెబుతున్నార‌ని..తాము నూత‌న స‌చివాల‌యం- క‌ళా భార‌తి, అసెంబ్లీ మొత్తం 250 కోట్ల‌తో అద్బుతంగా నిర్మించే ప్లాన్ సిద్ద‌మైంద‌ని చెప్పుకొచ్చారు. మ‌రి..వీటి నిర్మానం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన నిధులు మింగేసారా అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు ఇద్ద‌రు చంద్రులు ఒక‌రి పై మ‌రొక‌రు చేస్తున్న వ్యాఖ్య‌ల‌తో ఇద్దరి మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ ముదిరిన‌ట్లే. మ‌రి..ఇది ఎటువంటి రాజ‌కీయా ప‌రిణామాల కు దారి తీస్తుందో చూడాలి..

English summary
KCR slams Chandra Babu on Ap special stauts isuse. He alleged that Chandrababu naidu had been cheating the people of AP. Chandra babu naidu is not a leader but a manager. political war begins between both CM's.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X