తండ్రి మృతి: జయసుధ వద్ద నాగ్ కంటతడి (పిక్చర్స్)

హైదరాబాద్: పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు మృతికి విషణ్న వదనుడైన హీరో అక్కినేని నాగార్జునను సినీ, రాజకీయ ప్రముఖులు పలకరించి, ఓదార్పు మాటలు చెబుతూ వచ్చారు. అక్కినేని నాగేశ్వర రావు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ వచ్చారు.

అక్కినేని నాగేశ్వర రావు మృతితో ఆయన కుటుంబమే కాదు, సినీ ప్రపంచమే ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వర రావును కడపటిసారి చూసి, నివాళులు అర్పించారు.

అక్కినేని నాగేశ్వరరావు మూడు తరాల హీరోయిన్లతోనే కాకుండా మూడు తరాల హీరోలతో కూడా కలిసి నటించారు. చిరంజీవి, శ్రీకాంత్ వంటి నటులతో ఆయన నటించారు. సీతారామయ్యగారి మనవరాలు చిత్రంలో ఆయన పాత్ర విశేష ఆదరణ లభించింది. మద్రాసు నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదుకు తరలి రావడానికి ఆయనే ఆద్యుడు.

కంట తడిపెడుతూ..

కంట తడిపెడుతూ..

అక్కినేని నాగేశ్వర రావు మృతికి కన్నీరు పెడుతూ ఇలా.. ఆ విషాదాన్ని పంచుకుంటున్న అక్కినేని నాగార్జున..

అక్కినేని భౌతిక కాయం..

అక్కినేని భౌతిక కాయం..

తొంబై ఒక్క ఏళ్లు జీవించి, తన సమకాలీనులంతా పైలోకాలకు వెళ్తుంటే బాధపడుతూ వచ్చిన అక్కినేని నాగేశ్వర రావు కన్నుమూసి ఇలా...

కిషన్ రెడ్డి నివాళి

కిషన్ రెడ్డి నివాళి

అక్కినేని నాగేశ్వర రావు భౌతిక కాయాన్నిసందర్శించి, బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు.

జూ. ఎన్టీఆర్ ఓదార్పు మాటలు..

జూ. ఎన్టీఆర్ ఓదార్పు మాటలు..

తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న అక్కినేని నాగార్జునకు ఓదార్పు మాటలు చెబుతూ విషాదాన్ని పంచుకున్న జూనియర్ ఎన్టీఆర్.

మహేష్ బాబు ఓదార్పు పలకరింపులు..

మహేష్ బాబు ఓదార్పు పలకరింపులు..

తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న అక్కినేని నాగార్జునను పలకరిస్తూ ప్రిన్స్ మహేష్ బాబు ఇలా కనిపించారు. ఆయన తన భార్యతో కలిసి వచ్చి అక్కినేనికి నివాళులు అర్పించారు.

కడపటి చూపు కోసం..

కడపటి చూపు కోసం..

అక్కినేని నాగేశ్వర రావును కడసారి చూడడానికి అభిమానులు ఇలా బారులు తీరారు. ఆయన పట్ల ప్రజల్లో ఆదరణ అలాగే నిలిచి ఉంది.

రామానాయుడు నివాళి..

రామానాయుడు నివాళి..

రామానాయుడు నిర్మించిన పలు చిత్రాల్లో అక్కినేని నాగేశ్వర రావు నటించారు. అక్కినేనికి నివాళులు అర్పిస్తూ రామానాయుడు ఇలా..

రామోజీ రావు నివాళి..

రామోజీ రావు నివాళి..

ప్రముఖ చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వర రావు భౌతిక కాయాన్ని సందర్శించి ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావు నివాళులు అర్పించారు.

విమలక్క కూడా నివాళి..

విమలక్క కూడా నివాళి..

తెలంగాణ ఉద్యమ నేత, గాయకురాలు విమలక్క అక్కినేని నాగేశ్వర రావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

జయసుధ వద్ద కంటతడి పెట్టిన నాగ్

జయసుధ వద్ద కంటతడి పెట్టిన నాగ్

సినీ నటి, శాసనశభ్యురాలు జయసుధ వద్ద అక్కినేని నాగార్జున కంట తడి పెట్టారు. చాలా నిబ్బరంగా కనిపించిన ఆయన కంట తడి పెట్టడం అందరినీ కలచివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+