Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏడుకొండల స్వామి సాక్షిగా తిరుపతిలో దొంగ ఓట్లు, ఫామిలీ ప్యాకేజ్, అందుకే మాస్టర్ ప్లాన్ తో ?

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల సందర్బంగా పలు నియోజక వర్గాల్లో దొంగ ఓట్లు వెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అయితే కూటమి ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు వెయ్యడానికి వచ్చిన వారిని అడ్డుకోవడంతో పలు ప్రాంతాల్లో పోలింగ్ పూర్తి అయిన కొన్ని గంటల తరువాత అర్దరాత్రి గొడవలు జరిగాయి.

ఏడుకొండల స్వామి కొలువు తీరిన తిరుపతిలో దొంగనోట్లు వేశారని వెలుగు చూసింది. తిరుపతి నగరంలో దొంగ ఓట్లు వెయ్యడానికి ప్రయత్నించిన వారిని పట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దొంగ ఓట్లు వెయ్యడానికి ప్రయత్నించిన యువకులను కేంద్ర బలగాలు చితకబాదిన వీడియో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ దాటి ఇతర రాష్ట్రాల్లో కూడా వైరల్ గా మారిపోయాయి.

Polling agents caught all those who tried to steal votes for YCP in Tirupati

వేరకరి ఓటరు స్లిప్పులతో ఓట్లు వెయ్యడానికి వచ్చిన వారిని పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోలింగ్ ఏజెంట్లు అడ్డుకున్నారు. తిరుపతిలోని దొడ్డాపురం వీధిలోని పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వెయ్యడానికి ప్రయత్నించిన వారిని కూటమి పోలింగ్ ఏజెంట్లు గుర్తించి వారిని కేంద్రబలగాలకు అప్పగించారు. రేణిగుంటలోని పాంచాలి నగర్ కు చెందిన భరత్ కుమార్, అదే రేణిగుంటలోని గుత్తివారి పల్లెకు చెందిన నరేష్ అనే ఇద్దరిని చితకబాదిన కేంద్ర బలగాలు చివరికి వారిని తిరుపతి ఈస్ట్ పోలీసులకు అప్పగించారు.

వైకాపాకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థికి దొంగ ఓట్లు వెయ్యడానికి వచ్చినట్లు నిందితులు ఇద్దూ అంగీకరించారని తెలిసింది. తిరుపతి నగరంలోని నెహ్రూ మున్సిపల్ మైదానం సమీపంలోని పాఠశాలలోని బూత్ నెంబర్ 39లో దొంగఓట్లు వెయ్యడానికి ప్రయత్నించిన దంపతులను కూటమి ఏజెంట్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుపతిలోని విజయపురం కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు, భవాని దంపతులు దొంగఓట్లు వెయ్యడానికి ప్రయత్నించారు.

Polling agents caught all those who tried to steal votes for YCP in Tirupati

దంపతుల మీద ఎన్నికల అధికారులు ఫిర్యాదు చెయ్యడంతో స్థానిక పోలీసులు ఆ దంపతుల మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తిరుపతిలోని ఎన్టీవీ నగర్ కు చెందిన ఓ వ్యక్తి 147వ పోలింగ్ బూత్ లో వైసీపీకి ఓటు వేశాడు. వైసీపీకి ఓటు వేస్తున్న ఆ వ్యక్తి ఆ సమయంలో ఈవీఎం మీద ఫ్యాన్ గుర్తు పడి ఉన్న విషయాన్ని సెల్ ఫోలో చిత్రీకరించి దానికి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అతని మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

తిరుపతి 42వ డివిజన్ వైసీపీ కార్పోరేటర్ శేఖర్ రెడ్డి దగ్గర గ్యాస్ డెలవరీ బాయ్ గా పని చేస్తున్న మునికుమార్ అనేవ్యక్తి బూత్ నెంబర్ 95లో దొంగ ఓటు వెయ్యడానికి ప్రయత్నించగా ఎన్నికల అధికారి గుర్తించి అతన్ని అలిపిరి పోలీసులకు అప్పగించారు. తిరుపతిలో దొంగఓట్లు వెయ్యడానికి వైసీపీ నాయకులు తమిళనాడు, కోడూరు, రేణిగుంట ప్రాంతాల నుంచి పలువురిని రప్పించారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+