పోలింగ్ షురూ, ప్రతిష్ఠాత్మకం - గెలుపెవరిది..!!

ఏపీలో మరో ఎన్నికకు పోలింగ్ మొదలైంది. గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ ఉదయం మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ నెల 9న కాకినాడలో కౌంటింగ్ జరగనుంది. సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రచారం చేసిన అభ్యర్ధులు చివరి నిమిషం వరకు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేసారు. ఇద్దరు అభ్యర్ధుల మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది.

గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బై పోల్ పోలింగ్ కొనసాగుతోంది. గోదావరి పరిధిలోని మొత్తం ఆరు జిల్లాల్లోని 116 కేంద్రాల్లో పోలింగ్ మొదలైంది. 16,737 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనునున్నారు. బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ జరుగుతోంది. ఈ సాయంత్రం పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్సులను కాకినాడలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించనున్నారు. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి మృతి చెందటతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది.

Polling begins for Teacher MLC Election in Godavari Dists Counting on 9th

బ్యాలెట్‌ పేపర్లపై ప్రాధాన్యతా క్రమంలో ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈ ఎన్నికలో బొర్రా గోపిమూర్తి, గంధం నారాయణరావు, దీపక్‌, కవల నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి పోటీలో ఉన్నారు. వీరిలో గోపిమూర్తి, గంధం నారాయణరావు మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇప్పటికే వీరిద్దరికి ఉపా ధ్యాయ సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో గోపిమూర్తి తొలిసారిగా బరిలో దిగారు. కాగా, గంధం నారాయణరావుకు మరో సారి అదృష్టాన్ని పరిశీలించుకోబోతున్నారు. గోపిమూర్తికి యూటీఎఫ్‌తో పాటు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇక, గంధం నారాయణ రావుకు ఎస్టీయూ, మరికొన్ని సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఈ ఇద్దరి మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+