బిజెపిలోకా: పొంగులేటి ఆరా, సోనియా నో అంటే..: జెసి

మీరు బిజెపిలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోందని, అలాంటి పార్టీలోకి వెళ్తారా అని పొంగులేటి ప్రశ్నించారు. అందుకు జెసి స్పందిస్తూ.. చాలామంది నాయకులు ఇదే ఆలోచనతో ఉన్నారని, రాష్ట్రాన్ని విభజించాలన్న పార్టీ నిర్ణయంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో పార్టీని వీడే ఆలోచన కాకుండా ఇంకేం చేయాలని బదులిచ్చారు.
సోనియా వినకుంటే అంతే: జెసి
సీమాంధ్ర కాంగ్రెసు నేతలం అందరం ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి రాష్ట్రాన్ని విభజించవద్దని చెబుతామని, ఆమె వినకపోతే అందరం కలిసి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామని జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చెప్పినట్లుగా తెలుస్తోంది.
కిరణ్‌తో జెసి భేటీ అయినప్పుడు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు కొండ్రు మురళీ, అహ్మదుల్లా తదితరులు అక్కడే ఉన్నారు.












Click it and Unblock the Notifications