వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నియంత దోరణి: కెసిఆర్‌పై పొంగులేటి, కేంద్రంపై విహెచ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సిఎం కెసిఆర్ నియంతృత్వ దోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ మాటలకు చేతలకు పొంతన ఉండదని ఎద్దేవా చేశారు.

ఆగస్టు 19న నిర్వహించే సామాజిక సర్వేను మూడు దశల్లో నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌పై రెండు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ల తీరు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోందని అన్నారు.

విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దని ఆయన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. తక్షణమే ఎంసెట్ అడ్మిషన్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని పొంగులేటి అన్నారు.

 Ponguleti Sudhakar Reddy fires at KCR

అధికారాలు గవర్నర్‌కిస్తే.. సిఎం ఎందుకు: విహెచ్

హైదరాబాద్‌ శాంతి భద్రతలకు సంబంధించిన అధికారాలను గవర్నర్‌కు కట్టబెట్టం అభ్యంతరకరమని కాంగ్రెస్ ఎంపి వి హనుమంతరావు అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌కు ఇస్తే పాలన సజావుగా సాగదని అన్నారు. గవర్నర్‌కే అధికారాలు ఇస్తున్నప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రి, హోంమంత్రి ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించారు.

గవర్నర్, సిఎంలకు వేర్వేరు ఆలోచనలుంటాయని ఆయన అన్నారు. ప్రతి విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుంటే ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంటుందని విహెచ్ అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు మాత్రమే గవర్నర్ జోక్యం చేసుకునేలా చేస్తే సరిపోతుందని చెప్పారు.

English summary
Congress MLC Ponguleti Sudhakar Reddy on Saturday fired at Telangana CM Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X