మాదే బాధ్యత: ఫలితాలపై పొన్నం, ఢీలాపడ్డ జగన్ పార్టీ
కరీంనగర్: స్థానాలు తక్కువగా వచ్చినప్పటికీ వేములవాడ, హుజూరాబాదు మున్సిపాలిటీలతో పాటు, కరీంనగర్ కార్పోరేషన్‌ల పైన కాంగ్రెసు పార్టీ జెండా ఎగురవేస్తామని, బాధ్యత తమదేనని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ సోమవారం చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి విజయం అందించినందుకు ఆయన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
మే 16న విడుదల కానున్న అసెంబ్లీ, లోకసభ ఫలితాలలోను ఇదే పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలో మిశ్రమ ఫలితాలకు తమదే బాధ్యత అని చెప్పారు. జిల్లాలో పార్టీని మరింత పుంజుకునేలా చేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు మున్సిపాలిటీ ఫలితాలతో డీలపడింది. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయం ఖాళీగా కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నేతలు కూడా రాకపోవడంతో సందడి లేకుండా పోయింది. సీమాంధ్రలో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ విజయ బావుట ఎగువేయడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీని షాక్‌కు గురిచేసింది.
సీమాంధ్రలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో అందరూ ఊహించినట్టే కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. కనీసం నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయింది. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన సీమాంధ్ర ప్రజలు తమ ఆగ్రహాన్ని ఎన్నికల్లో చూపించారు. దీంతో కాంగ్రెస్ ఒక్క మునిసిపాల్టీని కూడా చేజిక్కించుకోలేకపోయింది. అంతేగాక చాలా మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేని దుస్థితి ఏర్పడింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications