పవన్ మా దృష్టిలో మంచివాడు, కానీ - వాళ్లే ఓడించారు : పోసాని...!!

జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఏపీలో పవన్ వాలంటీర్ల పై చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతున్న వేళ పోసాని స్పందించారు. వాలంటీర్ల వ్యవస్థను ప్రధాని పొగిడారని గుర్తు చేసారు. ఇప్పుడు ఆ వ్యవస్థను పవన్ కించపర్చేలా మాట్లాడారాని ధ్వజమెత్తారు. చంద్రబాబు దృష్టిలో పవన్ ఓ వాన పాము అయితే..తమ దృష్టిలో మంచివాడని చెప్పుకొచ్చారు.పవన్ ను చంద్రబాబు పొరపాటు కూడా సీఎం చేయరని వ్యాఖ్యానించారు.

వాలంటీర్ల పై పవన్ చేస్తున్న వ్యాఖ్యలను పోసాని తప్పు బట్టారు. తన వ్యాఖ్యల పైన పవన్ రియలైజ్ కాలేరని..ఆ మాటలు చంద్రబాబు నుంచి వస్తున్న మాటలుగా పోసాని పేర్కొన్నారు. వాళ్ళ ట్రాప్ లో పడి అందరికి దూరం అయ్యావు పవన్ కళ్యాణ్ అంటూ వ్యాఖ్యానించారు.

Posani Krishna Murali made interesting comments on Pawan Kalyan

సినిమా ఇండస్ట్రీ అంటే చంద్రబాబుకు కోపమని చెప్పిన పోసాని తెలుగు ఇండస్ట్రీలో ట్రాఫికింగ్ ఉందని చంద్రబాబు చెప్పారని గుర్తు చేసారు. పవన్ పైన పోసాని గత అంశాలను ప్రస్తావిస్తూ సెటైర్లు వేసారు. రాజేంద్రప్రసాద్ చంద్రబాబు శిష్యుడని... రాజధానికి మద్దతుగా సినిమా వాళ్ళు రాలేదని తిట్టించారని పేర్కొన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎవడ్రా తిట్టింది అని పవన్ అనలేదేంటని ప్రశ్నించారు.

శ్రీ కృష్ణుడు గోపిలలతో సరసాలు ఆడినట్లు చంద్రబాబు కొడుకు లోకేష్ సరసాలు ఆడాడు. అప్పుడు పవన్ అడగలేదని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం నాశనం కావాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారుని..జగన్ ఏం పాపం చేసారని పోసాని ప్రశ్నించారు.

చంద్రబాబు పొరపాటున కూడా పవన్ ను సీఎం చేయరని పోసాని చెప్పుకొచ్చారు. భీమవరంలో రూ 15 కోట్లు ఖర్చు చేసిన టీడీపీ నేతలే పవన్ ను ఓడించారని పోసాని కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు, ఆయన కొడుకు పుణ్యమా అని డేటా చోరీ జరిగిందన్నారు.

పవన్ ను చంద్రబాబు ఎమ్మెల్యేగా కూడా గెలవనీయరని జోస్యం చెప్పారు. ఏదైనా సమాచారం ఉంటే నిఘా సంస్థలు ప్రభుత్వ పెద్దలకు చెబుతారని వివరించారు. కేంద్ర నిఘా వర్గాలు 2024లో భావి భారత ప్రధాని పవన్ కళ్యాణ్ అని అనుకుని వాలంటీర్ల వ్యవస్థ గురించి చెప్పి ఉంటారని ఎద్దేవా చేసారు.

పవన్ కళ్యాణ్ అబద్ధం ఆడుతున్నారని ఆయన ముఖంలో తెలుస్తోందని పోసాని వ్యాఖ్యానించారు. పవన్ కు విలువలు ఉంటే వెంటనే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్ సీఎంగా ఉంటారని పోసాని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+