హిడ్మా అరెస్టుతో విజయవాడ, కాకినాడలోకి మావోలు..! 31మంది అరెస్ట్-డంప్స్ సీజ్..!
మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టుల్ని ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో పోలీసులు హతమార్చారు. దీని తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ తో హిడ్మా దళం సభ్యులంతా ఏపీ జిల్లాల్లోకి పారిపోయారు. వీరితో పాటు భారీ ఎత్తున ఆయుధాల డంప్ లు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని విజయవాడ, కాకినాడ సహా పలు చోట్ల ఈ డంప్ లతో పాటు వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రంలో హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్హా కీలక ప్రకటన చేశారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని, ఇవాళ ఉదయం 6.30 నుంచి 7 గంటల మధ్యలో ఎన్‌కౌంటర్ జరిగిందని తెలిపారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇవాళ అరెస్టైన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారని మహేష్‌చంద్ర లడ్డా తెలిపారు.

రెండు రోజులుగా ఇంటెలిజెన్స్ సమాచారంతో మావోయిస్టుల గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టామని మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. మావోయిస్టుల నుంచి వివిధ రకాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. మరోవైపు కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. వీరిలో 9 మంది మహిళలు కూడా ఉన్నారన్నారు.

అలాగే మావోయిస్టులతో పాటు భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు లడ్డా తెలిపారు.
వీటిలో రెండు ఏకే 47లు,, ఒక పిస్టోల్ , ఒక రివాల్వర్, సింగిల్ బోర్ ఆయుధం, 1525 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 150 నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, మరో ఎలక్ట్రికల్ వైర్ బండిల్, కెమెరా ఫ్లాష్ లైట్ , కటింగ్ బ్లేడ్ , 25 మీటర్ల ప్యూజ్ వైర్, ఏడు కిట్ బ్యాగులు ఉన్నట్లు లడ్డా తెలిపారు.












Click it and Unblock the Notifications