గన్నవరంలో టీడీపీకి నిరాశ..వల్లభనేని వంశీ గెలుపు పక్కా..?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హాట్ సీట్లలో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ఒకటి. గన్నవరం ఫలితం కోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో తలబడ్డ అభ్యర్థులే తిరిగి పోటీ చేశారు కానీ..పార్టీలే వేర్వేరు కావడం ఇక్కడ విశేషంగా మారింది. 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించగా, వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేసి వంశీ చేతిలో ఓడిపోయారు.అయితే నియోజకవర్గంలో జరిగిన రాజకీయ మార్పులతో వీరద్దరు కూడా పార్టీలు మారి మరి ఇక్కడ నుంచి పోటీ చేశారు.
దీంతో విజయం ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠ యావత్తు రాష్ట్రం మొత్తం నెలకొంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ ఈసారి వైసీపీ నుంచి పోటీ చేయగా.. వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ నుంచి బరిలోకి దిగారు. ఈక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా , గన్నవరం నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారో అనేది ఈ సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గతంలో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థులే అత్యధికసార్లు విజయం సాధించారు.

వల్లభనేని వంశీ 2014,2019 ఎన్నికల్లో టీడీపీ తరుఫున గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో అతి స్వల్ప ఓట్ల తేడాతో ఆయన బయటపడటం జరిగింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వరుసగా టీడీపీ అభ్యర్థులే విజయం సాధించగా..వంశీ వరుసగా రెండు సార్లు గెలిచారు. ఈసారి వైసీపీ నుంచి గెలిచి గన్నవరంలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారాయన.ఈసారి అధికారికంగా గన్నవరం తమది అనిపించుకోవాలని వైసీపీ సైతం భావిస్తోంది. అయితే టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కూతురు , మాజీ సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయన గెలుపుకు ప్రతిబంధకంగా మారాయి.
ఇక్కడ ఎలాగైనా వంశీని ఓడించాలనే కసితో ఈ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు పని చేశాయి. చంద్రబాబు సామాజికవర్గం అంతా కూడా ఒకటై వంశీని ఓడించాలని ప్రయత్నించాయి. టీడీపీ నుంచి వైసీపీలో చేరినప్పుడే వంశీ.. ఇదింతా కూడా ముందే ఊహించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కమ్మ సామాజికవర్గం ఓట్లు దాదాపు 30 వేల ఓట్లు ఉంటాయని అంచనా. ఆ సామాజికవర్గం ఓట్లను తాము పరిగణలోకి తీసుకోలేదని వంశీ అనుచరులు చెబుతున్నారు.
గన్నవరంలో టీడీపీ ఇమేజ్ కన్నా వంశీ వ్యక్తిగత ఇమేజ్‌ను ఎక్కువగా సంపాదించుకున్నారనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కష్టం అంటూ ఎవరైన వచ్చి తలుపు తట్టితే..వారిని అదుకుంటారని..వారంతా కూడా కచ్చింతంగా వంశీ వెంటే ఉంటారని ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు.బీసీ సామాజికవర్గం కూడా తమవెంటే ఉందని వంశీ వర్గం చెబుతోంది. వల్లభనేని వంశీకి నియోజకవర్గంపై మంచి పట్టుంది.పైగా పోలింగ్ మేనేజ్మెంట్‌లో వల్లభనేని వంశీ సిద్దహస్తుడు. దీనికి తోడు రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం కూడా ఆయనకు కలిసి వస్తుందని వంశీ అనుచరులు చెబుతున్న మాట.
వంశీ బలానికి జగన్ సంక్షేమ ఫలాల మద్దతు తోడయితే ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అని రాజకీయ పరిశీలకులు సైతం భావిస్తున్నారు.మరోవైపు వంశీని ఓడించి ఆయనకు రాజకీయంగా చెక్ పెట్టాలని యార్లగడ్డ వెంకట్రావు గట్టిగానే ప్రయత్నించారు. స్థానికంగా అందరికి అందుబాటులో ఉండటం.. సేవా కార్యక్రమాలు చేయడం వంటివి వెంకట్రావుకు అనుకూల అంశాలని అంటున్నారు. గత ఎన్నికల్లో స్పల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోవడంతో ఈసారి తనదే విజయమనే ధీమా ప్రదర్శిస్తున్నారాయన. మరి గన్నవరం ఎవరి వశం అవుతుందో జూన్ 4న వెలువడే ఫలితాలతో తేలిపోతుంది.












Click it and Unblock the Notifications