మొదలైన పోలింగ్ - ఏపీ పబ్లిక్ మూడ్ క్లియర్..!!

ఏపీలో పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. పార్టీల మధ్య పోరు హోరా హోరీగా మారుతోంది. అన్ని వర్గాలకు ఆకట్టుకొనేందుకు పార్టీలు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు ఓటు వేసేందుకు ఉద్దేశించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు ఆదివారం పలు ప్రాంతాల్లో ఉద్యోగులు బారులు తీరారు. ఓటు వేసేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్రాల వద్ద అధికారులు హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు.

ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళ వారి ఎన్నికల విధి సర్టిఫికెట్లను పరిశీలించి పోలింగ్‌ బూత్ లోకి అనుమతిస్తున్నారు. ఏపీలోని ఓటర్లలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందులో మెజార్టీ సంఖ్యలో పోలింగ్ విధులకు ఎంపికయ్యారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కొనసాగుతోంది. ఉద్యోగులు ఎవరికి ఓటు వేస్తారనేది పార్టీల్లో భిన్న అంచనాలు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను తమ వైపు తిప్పుకోవటానికిపార్టీలు చివరి వరకు ప్రయత్నించాయి. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని..వారి ఓట్లు తమకు అనుకూలంగా ఉంటుందని టీడీపీ కూటమి అంచనా వేస్తోంది.

Postal ballot polling begins in AP Employees participated in huge number

అయిదేళ్ల కాలంలో ఉద్యోగుల కోసం ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని..వారి మద్దతు తమకు ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, కూటమి - వైసీపీ కి మద్దతు అన్నట్లుగా ఉద్యోగుల్లోనూ పార్టీలకు మద్దతు కనిపిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇప్పటికే హోం ఓటింగ్ నిర్వహిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తరువాత ఇక అధికారికంగా అధికారులు తమకు కేటాయించిన ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఈ నెల 13న పోలింగ్ కు ముందు రోజునే తమకు కేటాయించిన కేంద్రాల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గంటున్న పి.ఓ లు, ఎ పి ఓ లు, మైక్రో అబ్జర్వర్లు , పోలీసు, ఆర్‌.టి సి ఉద్యోగులు, ఎసెన్షియల్‌ సర్వీసు లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+