లవ్ అఫైర్: ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టి ఆత్మహత్య

కుత్బుల్లాపూర్ పరిధిలోని ఎన్ఎల్బీనగర్‌లో తన స్నేహితులతో కలిసి ఉంటున్న వేణు ఆరు నెలలుగా ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. బుధవారం తన స్నేహితుడు అనిల్ విధి నిర్వహణ ముగించుకుని సాయంత్రం తిరిగి రూమ్‌కి వచ్చి చూసే సరికి వేణు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. కాగా తన ప్రియురాలు తల్లిదండ్రులు తమ వివాహానికి ఒప్పుకోలేదని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వేణు ఫేస్ బుక్‌లో సందేశం పెట్టాడు.
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అల్వాల్ పోలీసుల కథనం ప్రకారం.. కడప జిల్లా నాగినిపల్లి గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ హైదరాబాద్‌లో బిట్స్ పిలానీలో రసాయన శాస్త్రంలో పిహెచ్‌డి చేస్తున్నాడు. గత నెల 28న క్యాంపస్ ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తున్న సమయంలో ఓ రసాయనాన్ని తాగాడు. వెంటనే అతన్ని తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు.
అరుణ్ కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. అయితే అతని స్నేహితులు మాత్రం ప్రేమ వ్యవహారం కారణంగానే అరుణ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. అరుణ్ కుమార్ మృతిపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications