"ర్యాగింగ్ చేస్తే ఇక జైలుకే"...పోస్టర్ విడుదల చేసిన కలెక్టర్
విజయనగరం:జిల్లా కలెక్టర్ ఎం.హరి జవహర్ లాల్ మంగళవారం కలెక్టరేట్ వద్ద "ర్యాగింగ్ చేస్తే ఇక జైలుకే"...పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.హరి జవహర్ లాల్ మాట్లాడుతూ కళాశాలలో ర్యాగింగ్ వంటి దుశ్చర్యల వల్ల విద్యార్థుల భవిష్యత్ బుగ్గిపాలవుతుందన్నారు.
దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రుల కన్న కలలు కలలుగానే మిగులుతాయని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలన్నారు. కళాశాలలో చేరిన విద్యార్థులు స్నేహభావంతో మెలగాలన్నారు. అలాకాకుండా తోటి విద్యార్థులను ఇబ్బందులు పెడితే చట్టం ఉచ్చులో ఇరుక్కొని జైలుకు పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

విద్యాసంస్థలలో తోటి విద్యార్థులను ఇబ్బందికి గురిచేసే చర్యలు చోటు చేసుకోకుండా యాజమాన్యాలు నిఘా ఉంచాలన్నారు. విద్యార్థులు ర్యాగింగ్ జోలికి పోకుండా స్నేహభావంతో మెలిగేలా యాజమాన్యం కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సైకాలాజిస్ట్ ఎన్.సూర్యనారాయణ, హిమబిందు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications