వైసీపీకి వీరవిధేయుడు, పరిటాల ఫ్యామిలీతో తేడాలు, చంద్రబాబు ప్రభుత్వంలో?

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వైసీపీ మద్దతు దారులైన అధికారుల చక్రం తిప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అలాంటి అధికారులు పైరవీలతో ఎక్కడికైనా వస్తామని, మాకు ఉండే పవర్ అలాంటిది అని ఓ మున్సిపల్ కమిషనర్ నిరూపించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. పరిటాల కుటుంబం ఇన్ చార్జ్ గా ఉన్న నియోజకవర్గంలోనే వైసీపీ నాయకులతో క్లోజ్ గా ఉండే ఓ అధికారి పోస్టింగ్ తెచ్చుకోవడంతో అందరూ షాక్ అయ్యారు.

గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు చెప్పినట్లు నడుచుకుని అధికారం దుర్వినియోం చేసిన ఓ అధికారి మరోసారి అదే ప్రాంతంలో పోస్టింగ్ తెచ్చుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా పోస్టింగ్ తెచ్చుకున్న మల్లికార్జునకు ఉన్నతస్థాయి అధికారులు ఎవరెవరు సహకరించారు అంటూ టీడీపీ నాయకులు ఆరా తీస్తున్నారు.

Posting in Dharmavaram for the second time for an officer who is in favor of YCP

గతంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి తొత్తు అయిన ఈ అధికారికి ఎవరు సహాయం చేశారు అనే విషయంపై ఆరా తీస్తున్నామని, ఆయన మాత్రం ఆ పోస్టింగ్ లో కొనసాగించడానికి మేము అంగీకరించమని ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన టీడీపీ ఇన్ చార్జ్ పరిటాల శ్రీరామ్ మండిపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన మల్లికార్జున తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు.

2021 ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున బాధ్యత స్వీకరించారు. అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కనుసన్నల్లో పనిచేసిన మల్లికార్జున మున్సిపల్ ఎన్నికల్లో కూడా రిటర్నింగ్ అధికారిగా ఉంటూ వైసీపీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ గా ఎన్నికైన నిర్మల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోని మల్లికార్జున ఆయన సొంత నిర్ణయాలు తీసుకుని ధర్మవరం మునిసిపాలిటీలో మొత్తం అన్నీ తానే వ్యవహరించారు.

ఈ విషయంలో అప్పటి ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునపై మునిసిపల్ చైర్మన్ నిర్మల తీవ్రస్థాయిలో బహిరంగంగానే విమర్శించారు. తనను విమర్శించిన నిర్మలను చైర్మన్ పదం నుండి దించేసి కాచర్ల లక్ష్మిని చైర్మన్ పదవిలో కూర్చోపెట్టడంలో అప్పటి ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున కీలకపాత్ర పోషించారని, కేతిరెడ్డి కూడా మల్లికార్జునకు సహకరించారని ఆ నియోజకవర్గం ప్రజలు ఎప్పటికీ మాట్లాడుకుంటున్నారు.

Posting in Dharmavaram for the second time for an officer who is in favor of YCP

అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన 6,000 పక్కాఇళ్ల పట్టాలను రద్దు చేసిన మల్లికార్జున తీవ్రవాదాలకు తెరతీశారని, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి తొత్తుగా వ్యవహరించారని, కేతిరెడ్డిన చెప్పిన వాళ్లకు తరువాత ఇళ్ల పట్టాలు ఇచ్చారని స్థానిక టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ధర్మవరం మునిసిపాలిటీలో తీవ్ర వివాదాలకు కారణమైన మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గత ఏడాది ఆదోని మున్సిపల్ కమిషనర్ గా బదిలీ చేశారు.

అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లికార్జున మరోసారి ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా పోస్టింగ్ తెచ్చుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తొత్తుగా వ్యవహరించిన మల్లికార్జున ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గారు మరోసారి బాధ్యతలు స్వీకరించడానికి ప్రయత్నిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని, ఆయన్ని ఈ ప్రాంతానికి రానివ్వమని ధర్మవరం టీడీపీ ఇన్ చార్జ్ పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి పీఏ ద్వారా మల్లికార్జున మరోసారి ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా పోస్టింగ్ తెచ్చుకున్నారని అనంతపురం జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+