స్నేక్ గ్యాంగ్: నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కలకలం రేపిన స్నేక్ గ్యాంగ్ నిందితులను పోలీసులు సోమవారం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకు వచ్చారు. వారికి వైద్యులు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదులో స్నేక్ గ్యాంగ్ దారుణాలు కొద్ది రోజుల క్రితం వెలుగు చూసిన విషయం తెలిసిందే.
కాగా, పలువురు స్నేక్ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. స్నేక్ గ్యాంగ్ ఘోరాలను పలువురు వాట్సప్ ద్వారా అప్ లోడ్ కూడా చేశారు. వీరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాదులోని పాతబస్తీలోని షాహిన్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన సామూహిక అత్యాచారం దృశ్యాలను వాట్సప్ ద్వారా పంపిణీ చేసిన ఆరుగురిని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వారిని వలవేసి పట్టుకున్నారు. స్నేక్ గ్యాంగ్ దృశ్యాలను వారు సోషల్ మీడియాలో పెట్టారు. వాట్సప్ ద్వారా బాధితుల వీడియోలను ప్రచారంలో పెట్టిన సయ్యద్ బిన్ సలీం, మహ్మద్ బిన్ ఇబ్రహీం, మోసిన్ ఒమర్, అబీబ్ ఉస్మాన్ అరెస్టయినవారిలో ఉన్నారు. బాధితుల వీడియోలను ప్రసారం చేసిన ఆరు టీవీ చానెళ్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాదులోని పాతబస్తీలో గల ఫామ్‌హౌస్‌లో కాబోయే భర్తను మోకాళ్లపై కూర్చోబెట్టి యువతిపై స్నేక్ గ్యాంగ్ సభ్యులు సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. పాములతో భయపెట్టి మరీ దారుణానికి ఒడిగట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దయానీని పోలీసులు అరెస్టు చేశారు. మరికొంతమంది నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత స్నేక్ గ్యాంగ్ ఆగడాలు ఒక్కొటొక్కటే బయపడుతుంటే బయటి ప్రపంచం దిమ్మెరపోయింది.
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications