పవన్ కల్యాణ్‌పై పోతిన మహేష్ కీలక వ్యాఖ్యలు

కూటమిలో టికెట్ల పంచాయితీ ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు. టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య ఎన్నికల పొత్తు కొన్ని స్థానాల్లో కాకరేపుతోంది. సీటు తమకంటే తమకని నేతలు పట్టుబడుతున్నారు. మూడు పార్టీల్లో బలమైన నేతలు ఉండటమే ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. తొందరపడి అభ్యర్థిని ప్రకటించడం కంటే ఆలస్యం అయిన సరైన నిర్ణయం తీసుకోవడం మేలని మూడు పార్టీలు భావిస్తున్నాయి. అందుకే కొన్ని కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థుల లిస్ట్ పెండింగ్ పెట్టినట్టుగా సమాచారం అందుతోంది.

ఇలా పెండింగ్‌లో ఉంచిన నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూడా ఒకటి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును మూడు పార్టీల నేతలు ఆశించడంతో..ఈ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, బుద్దా వెంకన్న, షేక్ నాగుల్ మీరా, వంటి వారు టికెట్ ఆశిస్తుండగా, జనసేన నుంచి పోతిన మహేష్, బీజేపీ నుంచి సుజనా చౌదరి వంటి నేతలు విజయవాడ పశ్చిమ టికెట్‌ను ఆశిస్తున్నారు.

pothina mahesh interesting comments on pawan kalyan

ఇందులో ఎవరికి టికెట్ దక్కిన మిగిలిన వారు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో విజయవాడ పశ్చిమ టికెట్ ఎవరికి దక్కుతుందో అనే అతృతు అన్ని పార్టీల్లో నెలకొంది. టికెట్ విషయంలో జనసేన అభ్యర్థి పోతిన మహేష్ ఓ అడుగు ముందుకేసి నిరాహార దీక్షకు దిగారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ న్యాయంగా తనకే దక్కాలని.. తాను లోకల్ అని కూటమి నేతలకు గుర్తు చేస్తున్నారాయన.

పైగా జనసేనతో కలిసి తాను చేసిన పోరాటల వల్లే వెల్లంపల్లి నియోజకవర్గాన్ని మారారని పోతిన మహేష్ చెప్పుకొచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు తనని ఎమ్మెల్యేగా చేయడానికి సిద్దంగా ఉన్నారని..దానికి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన అవి ఫలించవని పోతిన మహేష్ తెలిపారు.ఇక్కడ తనకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చిన వైసీపీ నాయకులతో పోటీ పడలేరన్నారు. మా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని.. తరువాత లిస్ట్ తన పేరు కచ్చింతంగా ఉంటుందని పోతిన మహేష్ ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+