రేపు తిరుమలలో విశేష ఘట్టం- ఈ నెలలో రెండోసారి

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు ఏకంగా 70,496 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 29,327 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.95 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఏటీజీహెచ్ వరకూ క్యూలైన్ ఏర్పడింది.

టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 3.77 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అదే స్థాయిలో 2.28 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీటిని అందిస్తున్నారు.

Pournami Garuda Vahana Seva will be observed in Tirumala on October 26 Srivaru will be paraded

రేపు.. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరుగనుంది.సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి గరుడ వాహనంపై కొలువుదీరనున్నారు. భక్తకోటికి దివ్య దర్శనం ఇవ్వనున్నారు. దివ్యాభరణాలు ధరించిన శ్రీ మలయప్పస్వామి వారు జగన్మోహన రూపంలో గరుడ వాహనంపై అధిష్ఠించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు.

తిరుమలలో ఇక చింత లేకుండా
తిరుమలలో ఇక చింత లేకుండా

హిందూ పురాణాల ప్రకారం 108 వైష్ణవ దివ్య దేశాలలో గరుడ వాహన సేవకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. శ్రీమహావిష్ణువు పరమ భక్తుడు, వాహనమైన గరుడుడు వేద స్వరూపానికి, ఆధ్యాత్మిక జ్ఞానానికి వైరాగ్యానికి ప్రతీక. తనను సంపూర్ణ విశ్వాసంతో శరణు కోరిన భక్తులకు భగవంతుడు అందించే అపారమైన అనుగ్రహానికి ఈ సేవ నిదర్శనమని పండితులు చెబుతుంటారు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల పూర్వ జన్మల పాపాలు తొలగిపోవడమే కాకుండా, మనశ్శాంతి, సకల ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.

ఆర్ణబ్ తుఫాన్.. కాకినాడ- గోపాల్ పూర్ మధ్య తీరం దాటే ఛాన్స్ : కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఆర్ణబ్ తుఫాన్.. కాకినాడ- గోపాల్ పూర్ మధ్య తీరం దాటే ఛాన్స్ : కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఈ నెలలో గరుడ వాహనసేవను నిర్వహించబోతోండటం ఇది రెండోసారి. ఇటీవలే నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారు గరుడవాహనారూఢుడై అశేష భక్తజనావళిని కటాక్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆనవాయితీగా వచ్చే పౌర్ణమి నాటి గరుడ సేవ ఉత్సవం జరుగనుంది. ఇలా ఒకే నెలలో గరుడ సేవనునిర్వహించడం చాలా అరుదు. అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే ఇది ఏర్పడుతుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+