రోజాపై గ్యాంగ్ రేప్?: వైజాగ్ 'మిస్టరీ డెత్'పై అనుమానాలు..
రోజా మృతిపై జ్యుడిషియరీ విచారణకు ఆదేశించాలని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) నేతలు డిమాండ్ చేస్తున్నారు.
విశాఖపట్నం: విశాఖపట్నంలో ఎం.రోజా అనే యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై నిందితులను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై జ్యుడిషియరీ విచారణకు ఆదేశించాలని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) నేతలు డిమాండ్ చేస్తున్నారు.
వైజాగ్ పరిధిలోని పద్మనాభం మండలానికి చెందిన అనంతవరం గ్రామస్తురాలిగా యువతిని గుర్తించారు. ఆమె ఇంటికి 5కి.మీ దూరంలో ఉన్న ఓ బావిలోనే ఆమె శవమై కనిపించడం గమనార్హం. యువతిపై మిస్సింగ్ కేసు నమోదైన రెండు రోజులకు జులై 11వ తేదీన ఆమె మృతదేహం లభ్యమైంది. దీనిపై అనుమానాస్పద మృతిగా సెక్షన్-174కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

మృతురాలి బంధువులు మాత్రం ఇది కచ్చితంగా హత్యేనని ఆరోపిస్తున్నారు. నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం జరిపి, ఆపై బావిలోకి విసిరేశారని ఆరోపిస్తున్నారు. నిందితులు తమ పలుకుబడి ఉపయోగించి కేసును మూసివేయించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.
బుధవారం పీఓడబ్ల్యూ జనరల్ సెక్రటరీ ఎం.లక్ష్మీ దీనిపై స్పందించారు. రోజాది హత్య అని నిరూపించడానికి గ్రామస్తుల వద్ద, కుటుంబ సభ్యుల వద్ద సరైన ఆధారాలున్నాయని చెప్పారు. కానీ పోలీసులు, రెవెన్యూ అధికారులు మాత్రం నిందితుడు సంతోష్, అతని స్నేహితులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
స్థానిక తహశీల్దారు దీనిపై తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని లక్ష్మీ తెలిపారు. బలవంతపు పెళ్లి ఇష్టం లేకనే రోజా ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో పేర్కొన్నారు, అందులో నిజం లేదని స్పష్టం చేశారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications