వైజాగ్ కేజీహెచ్ అసుపత్రిలో అంధకారం (ఫోటోలు)
విశాఖపట్నం: విశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బుధవారం అంధకారం అలముకుంది. సుమారు నాలుగున్నర గంటలసేపు విద్యుత్ లేకపోవడంతో పలువార్డుల్లో రోగులు, సిబ్బంది చీకట్లోనే గడపాల్సిన పరిస్దితి ఏర్పడింది.
జనరేటర్ల ద్వారా తాత్కాలికంగా విద్యుత్ సరఫరా చేసినప్పటికీ ఆసుపత్రి మొత్తానికి సరిపోక పోవడంతో కొన్ని వార్డులు చీకట్లోనే మగ్గాల్సిన పరిస్దితి ఏర్పడింది. దీంతో వార్డులో చికిత్స పొందుతున్న చిన్నపిల్లలు, వృద్దులు తీవ్ర అవస్దలకు గురయ్యారు.
కొందరైతే చిన్నపిల్లలను వార్డు బయటకు తీసుకువచ్చి ఆడించారు. కేజీహెచ్‌కు ప్రత్యేక ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుంటుంది. ఐతే సాంకేతికలోపం తలెత్తడంతో బుధవారం మధ్యాహ్నాం రెండు గంటల సమయంలో సరఫరా నిలిచిపోయింది.
ఆసుపత్రి అధికారులు ఈపీడీసీఎల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సిబ్బంది వచ్చి సమస్య ఎక్కడుందో అనే దానిపై పరిశీలన జరిపారు. విద్యుత్ సరఫరా పునరుద్దరించేందుకు కొంత సమయం పడుతుందని భావించిన ఆసుపత్రి అధికారులు ఉన్న రెండు జనరేటర్ల ద్వారా కీలక విభాగాలకు విద్యుత సరఫారాను అందించారు.
జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేయడంతో అత్యవసర ఆపరేషన్ థియేటర్‌లో శస్త్రచికిత్సలు యధావిధిగానే జరిగాయి. ఆసుపత్రిలోని మీటర్ వ్వవస్దలో లోపం ఉన్నట్లు విద్యుత్ శాఖ సిబ్బంది గుర్తించడంతో ఫీడర్ ద్వారా వచ్చిన విద్యుత్‌ను నేరుగా సరఫరా చేశారు. సాయంత్రం ఆరున్నర గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్దరించడంతో రోగులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

వైజాగ్ కేజీహెచ్ అసుపత్రిలో అంధకారం
విశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బుధవారం అంధకారం అలముకుంది. విద్యుత్ సరఫరా లేక ప్యాన్లు నిలిచిపోవడంతో విసనకర్రతో విసురుతున్న తల్లి.

వైజాగ్ కేజీహెచ్ అసుపత్రిలో అంధకారం
విశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బుధవారం అంధకారం అలముకుంది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో కొవ్వుత్తి వెలుగులో విసనకర్రతో విసురుతున్న భర్త.

వైజాగ్ కేజీహెచ్ అసుపత్రిలో అంధకారం
విశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బుధవారం అంధకారం అలముకుంది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో కొవ్వుత్తి వెలుగులో తల్లి.

వైజాగ్ కేజీహెచ్ అసుపత్రిలో అంధకారం
విశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బుధవారం అంధకారం అలముకుంది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో కొవ్వుత్తి వెలుగులో విసనకర్రతో విసురుతున్న భర్త.

వైజాగ్ కేజీహెచ్ అసుపత్రిలో అంధకారం
జనరేటర్ల ద్వారా తాత్కాలికంగా విద్యుత్ సరఫరా చేసినప్పటికీ ఆసుపత్రి మొత్తానికి సరిపోక పోవడంతో కొన్ని వార్డులు చీకట్లోనే మగ్గాల్సిన పరిస్దితి ఏర్పడింది. దీంతో వార్డులో చికిత్స పొందుతున్న చిన్నపిల్లలు, వృద్దులు తీవ్ర అవస్దలకు గురయ్యారు.

వైజాగ్ కేజీహెచ్ అసుపత్రిలో అంధకారం
విశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బుధవారం అంధకారం అలముకుంది. బ్యాటరీ లైట్ వెలుగులో రిజస్టర్‌లో పేరు నమోదు చేసుకుంటున్న మహిళ.

Click it and Unblock the Notifications