పవన్ కల్యాణ్ బ్రేకింగ్ న్యూస్
ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రారంభించారో కానీ వాయిదాలు పడుతూనే ఉంది. అదిగో షూటింగ్ అంటే.. ఇదిగో షూటింగ్ అన్నట్లుగా తయారైంది. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం బ్యాలెన్స్ 30 శాతమే మిగిలింది. ఈ సినిమా నిర్మాతలు కూడా దీనికి సంబంధించి ఎటువంటి అప్ డేట్ ఇవ్వడంలేదు. సినిమా ప్రారంభమైనప్పుడు దీనిమీద భారీ అంచనాలుండేవి. నిదానంగా షూటింగ్ జరుగుతుండటంతో ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడంలేదు.
ఈ సినిమా పేరు హరిహర వీరమల్లు. కథానాయకుడు పవన్ కల్యాణ్. దర్శకుడు క్రిష్. నిర్మాత ఏఎం.రత్నం. ఇంతమంది మేరునగ ధీరులు ఈ సినిమాను నత్తనడకన నడిపిస్తున్నారు. హరిహర వీరమల్లు కోసం ఎక్కువ డేట్లు కేటాయించాల్సి ఉండటంతో తక్కువ డేట్లు ఉన్న రెండు సినిమాలను పవన్ పూర్తి చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబరు మొదటివారం నుంచి పవన్ కల్యాణ్ దీనికి డేట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.

మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి స్వరాలందిస్తున్నారు. నోరా ఫతేహి మరో హీరోయిన్ గా నటిస్తోంది. దీనికన్నా ఆలస్యంగా షూటింగ్ ప్రారంభమైన బ్రోతోపాటు మరో సినిమాను పవన్ కల్యాణ్ పూర్తిచేశారు. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోన్న వీరమల్లుకు ఎట్టకేలకు కదలిక రావడంతో ఈ సినిమాకు ఇకనైనా మోక్షం కలిగిందంటూ ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications