వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి
For Daily Alerts
Oneindia App Download

హర్టయ్యా, ఏమైనా చేస్తా: షర్మిలతో రూమర్స్‌పై ప్రభాస్

By Srinivas

Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు వైయస్ షర్మిలతో తనకు సంబంధాలు ఉన్నాయనే ప్రచారాన్ని హీరో ప్రభాస్ ఆదివారం తీవ్రంగా ఖండించారు. ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. షర్మిలతో సంబంధముందనే ప్రచారంలో అణువంత కూడా నిజం లేదన్నారు. ఈ ప్రచారం అంతా నిరాధారం అన్నారు. షర్మిలను తాను ఎప్పుడు కలవలేదని, మాట్లాడలేదని స్పష్టం చేశారు. కొన్నాళ్లుగా తన పైన చాలా రూమర్లు వచ్చాయని, వాటిని పెద్దగా పట్టించుకోలేదన్నారు.

అయితే ఇప్పుడు వచ్చిన రూమర్లు మరో వ్యక్తిని తీవ్రంగా బాధపెడుతున్నాయని, అందుకే తాను వీటిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఒక వ్యక్తికి భార్యగా, ఒక తల్లిగా సమాజంలో అత్యంత గౌరవం, ప్రతిష్ట కలిగిన వ్యక్తిని తీవ్రంగా దెబ్బతీసేలా ఈ రూమర్లు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ మేరకు తాను ప్రకటన చేస్తున్నట్లు చెప్పారు.

Prabhas condemns rumors

తనకు ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని చెప్పారు. ఇలాంటి నిరాధారమైన రూమర్ల కారణంగా ఒక వ్యక్తి ఎంత తీవ్రంగా బాధపడతారో, మనస్తాపం చెందుతారో తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. ఈ తరహా రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టడానికి తాను ఏం చేయడానికైనా సిద్ధమని చెప్పారు. దీనికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తాను పోలీసులను కోరుతున్నానని చెప్పారు.

Post by Prabhas.

గతంలో తన ఆరోగ్యంపై రూమర్లు వచ్చాయన్నారు. తాను కోమాలో ఉన్నట్లు, తీవ్రంగా గాయపడినట్లో ఏవోవే ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిపై తన కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడుతున్నారన్నారు. అయినా వాటిని తాను పట్టించుకోలేదన్నారు. అయితే ఇప్పుడు మరో వ్యక్తిని బాధపెట్టేలా ప్రచారం జరుగుతోందన్నారు. ఈ రూమర్‌తో తన మనసు తీవ్రంగా గాయపడిందన్నారు.

English summary
Over the past several months there have been many rumours concerning my health. My family members and close friends have received numerous phone calls from well wishers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X