అన్న పట్టుకుంటే.. తమ్ముడు తలను నరికాడు...! మణిక్రాంతి హత్యకేసులో కొత్త ట్విస్ట్...
విజయవాడలోని సత్యనారయణ పురం శ్రీనగర్ కాలనీలో భర్త చేతిలో దారుణంగా హత్యకు గురైన మణికాంత్రి హత్యకేసులో మరో ట్విస్టు బయటపడింది. మణిక్రాంతిని హత్య చేసి తలను వేరు చేయడంలో నిందితుడు ప్రదీప్ అన్నతో తో పాటు మరోకరు సహకరించారని తెలుస్తోంది. ఇద్దరు ఆమేను గట్టిగా కదలకుండా పట్టుకోగా ప్రదీప్ ఆమే తలను నరికాడని తెలుస్తోంది. అనంతరం ప్రదీప్ సోదరుడితోపాటు మరోకరు బైక్‌పై పారిపోయారని, ఆ తర్వాతే ప్రదీప్ తలను కవర్‌లో చుట్టుకుని బయటకు వచ్చాడని సమాచారం.

ఎంత కిరాతకుడైన ఒక్కడే చంపి తలను వేరు చేయడం అసాధ్యం. మణిక్రాంతి హత్య విషయంలో పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా తలను వేరు చేసి బుడమేరులో పడవేయడంతో,న్యాయపరంగా చిక్కులు ఎదురయ్యో అవకాశాలు ఉన్నాయి. కాగా కసితో భార్యను చంపిన ప్రదీప్ పక్కా ప్లాన్‌తోనే తల దొరక కుండా వ్వవహరించినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే తలను వేరు చేసిన ప్రదీప్ పారుతున్న నదిలో విసిరివేశాడు. దీంతో తల లేకుండానే మొండెంతో మణిక్రాంతి శవానికి దహన సంస్కరాలు నిర్వహించారు. మరోవైపు పోలీసులు మణిక్రాంతి తల కోసం బుడమేరులో వెతుకుతున్నారు.
అయితే కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసుల పక్కా ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. ఓవైపు తల కోసం వెతుకుతూనే..మరోవైపు నిందితుడికి ఎవరైన సహకరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే మణిక్రాంతిని హత్య చేయడంలో మరో ఇద్దరి పాత్ర ఉన్నట్టు తేల్చారు. ప్రదీప్ అన్నతో పాటు మరో వ్యక్తి అందుకు హత్యకు సహకరించారని, ఇద్దరు మణిక్రాంతిని గట్టిగా పట్టుకొన్న అనంతరం ఆమే తలను నరికాడని పోలీసులు తేల్చారు. దీంతో తల లేకున్నా మిగతా ఇద్దరు నిందితుల సాక్ష్యాలతో నిందితులకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications