కెసిఆర్! దాదాగిరి చేయి, పాతరేయకు!!: జవదేకర్

మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీరుపై బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. తమ పార్టీ అభ్యర్థి జగ్గారెడ్డి తరఫున ఆయన గురువారం మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం సాగించారు. కెసిఆర్‌పై ఆయన వాగ్బాణాలు సంధించారు.

మంచి కోసం దాదాగిరి చేసినా ఫరవా లేదు గానీ మీడియాను పాతరేస్తామనే మాటలు సమంజసం కాదని ఆయన అన్నారు. దాదాగిరి చేయాల్సి వస్తే తప్పును తప్పుగానే చూపించాలని, కానీ మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన కెసిఆర్‌కు హితవు చెప్పారు.

Prakash Javadekar warns KCR

అభివృద్ధి కోంస పాటు పడాలని, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన అన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి మెలసి ఉండాలని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. అంతేగానీ మీడియాను పాతరేస్తామని అనడం పద్ధతి కాదని ఆయన అన్నారు.

మీడియా కూడా బాధ్యతగా ప్రవర్తించాలని ఆయన సూచించారు. పాతరేస్తామనే భాషనే పాతరేయాలని ఆయన అన్నారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో గురువారం సాయంత్రం ప్రచార ఘట్టం ముగిసింది. చివరి రోజు ప్రకాష్ జవదేకర్ జగ్గారెడ్డి కోసం ప్రచారం సాగించారు.

బుర్ర ఉన్నవాళ్లు బిజెపి ఓటు వేయరని కెసిఆర్ అనడాన్ని ఆయన తప్పు పట్టారు. బుర్ర, హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ బిజెపికి ఓటు వేస్తారని ఆయన అన్నారు. 25 కోట్ల మంది ప్రజలు బిజెపికి మద్దతు పలికి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ వ్యాఖ్యలు దేశంలోని పేద ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+