ప్రకాష్ రాజ్ Vs జనసేన.. అమ్ముడుపోయారంటూ రచ్చ !
తెలుగు, తమిళం సహా పలు భాషల్లో ప్రముఖ నటుడిగా పేరుగాంచారు ప్రకాష్ రాజ్. విలక్షణ నటనకు ప్రసిద్ధి చెందిన ఆయన.. నెగటివ్, కారెక్టర్ రోల్స్‌తో ప్రేక్షకులను మెప్పించారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా ప్రశంసలు పొందారు. అంతే కాకుండా రాజకీయ, సామాజిక అంశాలపై కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయిన ముక్కుసూటిగా మాట్లాడే ప్రకాశ్ రాజ్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఈ మధ్య కాలంలో ఎక్కువగా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇప్పుడు లేటెస్ట్ గా మరోసారి పవన్ పై.. ప్రకాశ్ రాజ్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఛీ ఛీ ఈ రేంజ్ కి అమ్ముకోవడమా అంటూ కామెంట్స్ చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అందుకు జనసేన పార్టీ సైతం ఆయనకు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం పొలిటికల్ గానే కాకుండా సినీ వర్గాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది.

అసలు ఏం జరిగిందంటే..?
శుక్రవారం ( జూలై 11, 2025 ) నాడు రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యి.. హిందీ భాష గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృభాష అమ్మ అయితే, హిందీ భాష పెద్దమ్మ అని.. హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోయినట్టు కాదని అన్నారు. ఇంకో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదని.. కలిసి ప్రయాణం చేయడమని తెలిపారు.
ఈ range కి అమ్ముకోవడమా ….ఛి…ఛీ… #justasking https://t.co/Fv9iIU6PFj
— Prakash Raj (@prakashraaj) July 11, 2025
ప్రకాష్ రాజ్ vs జనసేన..
పవన్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. "ఈ రేంజ్ కి అమ్ముకోవడమా... ఛీఛీ... జస్ట్ ఆస్కింగ్" అంటూ పోస్ట్ పెట్టారు. అందుకు గాను జనసేన శతాగ్ని ప్రకాష్ రాజ్ చేసిన పోస్టుపై గట్టి కౌంటర్ ఇచ్చింది. " అమ్ముడుపోవడం అంటే ఇది ప్రకాష్ రాజ్ అంటూ ఓ వీడియోను ట్యాగ్ చేసింది. మాతృభాషను కాపాడుకుంటూ ఇతర భాషలను నేర్చుకోవడం, గౌరవించడం అమ్ముడు పోవడం కాదు. ఇతర భాషలు నేర్చుకోవడమే తప్పంటే.. ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేయగలరా.. ఈ రోజు ఇలా అమ్ముడుపోయి మాట్లాడగలరా అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది. మరి దీనిపై ప్రకాష్ రాజ్ మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
అమ్ముడుపోవడం అంటే ఇది @prakashraaj
— JanaSena Shatagni (@JSPShatagniTeam) July 12, 2025
అంతేకానీ మాతృభాషను కాపాడుకుంటూ, ఇతర భాషలను నేర్చుకోవడం, గౌరవించడం కాదు.... అసలు ఇతర భాషలు నేర్చుకోవడమే తప్పు అంటే నువ్వు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చెయ్యగలవా? ఈరోజు ఇలా అమ్ముడుపోయి మాట్లాడగలవా?#PaidArtistPrakashRaj https://t.co/Rmnu9knbI6 pic.twitter.com/6U5fAAQtF3
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications