ప్రకాశ్ రాజ్ ట్వీట్ కలకలం - బీజేపీ నేతల ఫైర్..!!
జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ రాజ్ కొత్త వివాదానికి కారణమయ్యారు. ప్రధాని మోదీతో సహా మరో ఇద్దరు మోడీ ఫొటోలతో ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదంగా మారుతోంది. రాజకీయ రచ్చకు కారణమైంది. ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ పైన బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అటు రాహుల్ గాంధీ పైన అనర్హత వేటుతో జాతీయ స్థాయిలో బీజేపీ వర్సస్ ప్రతిపక్షాలు అన్నట్లుగా రాజకీయం మారింది. దేశ వ్యాప్తంగా సత్యా గ్రహ దీక్షలకు కాంగ్రెస్ సిద్దమైంది. రాహుల్ వ్యాఖ్యలను..ప్రతిపక్షాల మద్దతును బీజేపీ తప్పు బడుతోంది. ఈ సమయంలో ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్ అవుతోంది.
General Knowledge:-
— Prakash Raj (@prakashraaj) March 25, 2023
What is common here #justasking pic.twitter.com/HlNCjJejwk
ప్రకాశ్ రాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. బీజేపీ పైన తరచూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే ప్రకాశ్ రాజ్ ఇప్పుడు చేసిన ట్వీట్ చర్చకు కారణమైంది. తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టింగ్ చేసారు. జనరల్ నాలెడ్జ్ అని పోస్టు చేసిన ప్రకాశ్ రాజ్.. మూడు ఫొటోలు జత చేసారు. ఇందులో కామన్ అంశం ఏంటని ప్రశ్నించారు. లలిత్‌మోడీ, నరేంద్రమోడీ, నీరవ్‌మోడీ ఫొటోలతో ఈ ప్రశ్న సంధించారు. రాహుల్ కామెంట్స్ ను పరోక్షంగా గుర్తు చేస్తూ ప్రకాశ్ రాజ్ ఈ ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా రాహుల్ కామెంట్స్.. కోర్టు తీర్పు..అనర్హత చర్చ వేళ ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ పైన బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్ కు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి స్పందించారు. ప్రకాశ్ రాజ్ కు సమాధానంగా ట్వీట్ చేసారు. లలిత్‌మోడీ, నీరవ్‌మోడీ ఇద్దరూ కూడా కాంగ్రెస్ హయాంలోనే స్కామ్‌లు చేశారన్న సంగతి మర్చిపోవద్దని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ అరాచకాలను ఎదుర్కొని దేశం గర్వించదగ్గ నేతగా ఎదిగారని, ఈ మూడింటిలో కామన్‌గా ఉన్నది కాంగ్రెస్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో రాహుల్ పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షకు నిర్ణయించింది.
-1st one did scams during CONGRESS era
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) March 25, 2023
-2nd one became a successful leader despite CONGRESS trying to finish him
-3rd one looted Indian banks with the help of CONGRESS
So common is Congress! https://t.co/kQ6Ee0XgKd
దేశం - ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను మాట్లాడుతూనే ఉంటానని రాహుల్ స్పష్టం చేసారు. తనను జైలుకు పంపినా వెనక్కు తగ్గేది లేదన్నారు. తాను క్షమాపణ చెప్పటానికి సావర్కర్ కాదని..తన పేరులోనే గాంధీ ఉందని వ్యాఖ్యానించారు. ఆదానీ వ్యవహారం సైడ్ చేయటానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నేడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షలకు దిగుతోంది. ఢిల్లీ రాజ్‌ఘాట్‌లో ఖర్గే, ప్రియాంక దీక్ష చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు దీక్షలకు సిద్దం అయ్యాయి. ఈ సమయంలో ప్రకాశ్ రాజ్ ట్వీట్ పైన చర్చ సాగుతోంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications