''నిన్ను వదిలేది లేదు''.. పవన్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్

నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వదిలేలా కనిపించడం లేదు. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్‌పై ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. లడ్డూ వివాదంపై ఒకరి మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. లడ్డూ వివాదానికి ప్రకాష్ రాజ్‌కు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని, అలాంటప్పుడు ప్రకాష్ రాజ్‌కు ఎందుకు ఈ వివాదంపై స్పందిస్తున్నారని పవన్ నిలదీశారు.

దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్ వరుసగా పవన్ కల్యాణ్‌పై ట్విట్టర్ ద్వారా ప్రశ్నిస్తున్నారు.మీ ప్రతి మాటకు సమాధానం చెబుతానని ప్రకాష్ రాజ్ తెలిపారు.నేను చెప్పిందేంటీ.. మీరు అర్థం చేసుకుంది ఏంటని పవన్ కల్యాణ్‌ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. మీకు వీలైతే నా ట్వీట్ మళ్లీ చదువుకోండంటూ పవన్ కల్యాణ్‌కు సెటైర్ వేశారు. తమిళ హీరో కార్తీ చేత పవన్ కల్యాణ్ సారీ చెప్పించుకున్న ఘటనపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు.చేయని తప్పుకి తమిళ కార్తీతో సారీ చెప్పించడంపై ఆయన ఈ వివాదంపై రియాక్ట్ అయ్యారని అర్థం అవుతోంది.

prakash raj satires on pawan kalyan

మరోసారి పవన్ కల్యాణ్‌పై ఆయన పరోక్షంగా ట్వీట్ చేశారు. ''గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం... ఏది నిజం? జస్ట్‌ ఆస్కింగ్‌?'' అంటూ ప్రకాష్ ట్వీట్ చేశారు.లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. దయచేసి దేవుడిని మీ రాజకీయాల్లోకి లాగకండి, హ్యాష్ ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్' అంటూ తన ట్విట్టర్ ఖాతా వేదికగా పోస్టు చేశారు. తాజాగా మరోసారి పవన్ కల్యాణ్‌కు వ్యతికరేకంగా ట్వీట్ చేశారు. ''స‌నాత‌న ధ‌ర్మ ర‌క్ష‌ణ‌లో మీరుండండి. స‌మాజ ర‌క్ష‌ణ‌లో మేముంటాం'' అంటూ ప‌వ‌న్‌కు ప‌రోక్షంగా కౌంట‌ర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+