ఎన్టీఆర్ దైవం, ఎన్నార్ మెంబర్: నాగ్‌కు ప్రణబ్ సందేశం
హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు వారి ఇంట ఆరాధ్య దైవం అయితే అక్కినేని నాగేశ్వర రావు తెలుగు వారి ఇంట సభ్యుడయ్యారు! ఎన్టీఆర్, అక్కినేనిలు పలు ఆధ్యాత్మిక చిత్రాలతో పాటు సామాజిక సినిమాలలోను నటించారు. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా చెన్నైలో ఉన్నప్పుడు హైదరాబాదుకు తరలి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి అక్కినేని అని అందరు గుర్తు చేసుకుంటున్నారు.
ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని అంత్యక్రియలు జరగనున్నాయి. సిని, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ... ఆధ్యాత్మిక చిత్రాల్లో నటించి ఎన్టీఆర్ ప్రతి ఇంట ఆరాధ్య దైవం అయ్యారని, అక్కినేని ఫ్యామిలీ మెంబర్ అయ్యారన్నారు. తాను మానకసి ప్రశాంతత కోసం అప్పుడప్పుడు అన్నపూర్ణ స్టూడియోకు వచ్చి వెళ్తానని చెప్పారు.

కాగా, అక్కినేని మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లు సంతాపం తెలిపారు. సినీ పరిశ్రమ ఓ సృజనాత్మక వ్యక్తిని కోల్పోయిందని ప్రణబ్ అన్నారు. రాష్ట్రపతి అక్కినేని తనయుడు నాగార్జునకు సంతాప సందేశం పంపించారు. అక్కినేని చిత్రాలు చిరస్మరణీయమని, అయనను ఎప్పటికీ మరువలేమని ఆ సందేశంలో పేర్కొన్నారు. భారత సినీ పరిశ్రమకు, ప్రత్యకంగా తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవ చేశారని కొనియాడారు.
అక్కినేని అనంత లోకాలకు వెళ్లారన్న వార్త తనను ఎంతో బాధించిందని, ఆయన ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, సినీ రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని ప్రధానమంత్రి సంతాపం వ్యక్తం చేశారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications