వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపితో పొత్తుపై జగన్ డైలమా: టిడిపి లెక్కతీస్తున్న ప్రశాంత్ కిషోర్

వచ్చే ఎన్నికల్లో బిజెపి - వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు లేదా పరోక్ష ఒప్పందం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసిపి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దీనిపై సర్వే చేశారని తెలుస్తోంది

|
Google Oneindia TeluguNews

అమరావతి: వచ్చే ఎన్నికల్లో బిజెపి - వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు లేదా పరోక్ష ఒప్పందం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసిపి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దీనిపై సర్వే చేశారని తెలుస్తోంది.

బిజెపితో పొత్తు పెట్టుకుంటే..?

బిజెపితో పొత్తు పెట్టుకుంటే..?

వచ్చే ఎన్నికల నాటికి బిజెపితో పొత్తు లేదా అవగాహన కుదుర్చుకుంటే ఏఏ ప్రాంతం నుంచి ఎంతమంది టిడిపి నేతలు వైసిపి వైపు వస్తారు, అక్కడ పార్టీకి చెందిన నేతలు ఎలా పని చేస్తున్నారు, ఎవరినైనా మార్చాల్సి ఉందా అనే అంశాలపై ప్రశాంత్ కిషోర్ సర్వే చస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సర్వే బాధ్యతలను జగన్ అప్పగించడంతో ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారని తెలుస్తోంది.

'జగన్ పార్టీలో 10మంది దొంగలు, అన్నొస్తున్నాడా లేక.. దొంగొస్తున్నాడా''జగన్ పార్టీలో 10మంది దొంగలు, అన్నొస్తున్నాడా లేక.. దొంగొస్తున్నాడా'

వాటిపై ప్రశాంత్ కిషోర్ దృష్టి

వాటిపై ప్రశాంత్ కిషోర్ దృష్టి

పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో, నేతల్లో ప్లస్‌లు, మైనస్‌లపై సర్వే చేయడం, వాటికి అనుగుణంగా వచ్చే ఎన్నికల నాటికి ఏం చర్యలు తీసుకోవాలి, అభ్యర్థుల మార్పు తదితర అంశాలపై ప్రశాంత్ కిషోర్ దృష్టి సారించారు.

Recommended Video

Chandrababu Fires On TDP Leaders Over YS Jagan Matter | Oneindia Telugu
సమావేశాలు

సమావేశాలు

ప్రధానంగా బిజెపితో పొత్తు, టిడిపి నుంచి ఎవరెవరు చేరుతారు అనే అంశంపై ప్రశాంత్ కిషోర్ దృష్టి సారించారని తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత ఇద్దరు సభ్యులతో కూడిన ప్రశాంత్ కిషోర్ బృందం నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రముఖులతో సమావేశమవుతున్నాయి. వారి నుంచి వివరాలు తీసుకుంటోంది.

పలు నియోజకవర్గాల్లో సర్వే పూర్తి

పలు నియోజకవర్గాల్లో సర్వే పూర్తి

ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ప్రశాంత్ కిషోర్ బృందం సర్వే పూర్తి చేసిందని తెలుస్తోంది. సర్వేల్లో ఎవరైనా స్థానిక నాయకులు కలవకుంటే.. వారిని ఫోన్ ద్వారా సంప్రదించి సమాచారం తెలుసుకుంటున్నారని తెలుస్తోంది.

వీటిపైనా సర్వే..

వీటిపైనా సర్వే..

మీ నియోజకవర్గ ఇంచార్జ్ పని తీరు ఎలా ఉందని, అందుబాటులో ఉంటారా అని, జిల్లా నాయకత్వం ఎలా ఉందని.. ఇలా ప్రశ్నలు వేస్తున్నారని తెలుస్తోంది.

బీజేపీతో పొత్తుపై..

బీజేపీతో పొత్తుపై..

బిజెపితో పొత్తు పెట్టుకంటే ఎలా ఉంటుందని ఇప్పటి దాకా సర్వే చేసిన నియోజకవర్గాల్లో ప్రశ్నిస్తే బాగానే ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. బిజెపితో కలిస్తే మన పార్టీలోకి వచ్చే టిడిపి నేతల లిస్ట్ ఇవ్వాలని కూడా అడిగారని తెలుస్తోంది.

ఆస్తి ఎక్కువైతే: హైదరాబాద్‌పై బాబు షాకింగ్, దానిపై పదేపదే.. జగన్-రోజాల ఎఫెక్టా?ఆస్తి ఎక్కువైతే: హైదరాబాద్‌పై బాబు షాకింగ్, దానిపై పదేపదే.. జగన్-రోజాల ఎఫెక్టా?

English summary
The political circles in the district are abuzz with the team members of election strategist Prashant Kishor plunging into action soon after the conclusion of the YSR Congress national plenary here on July 10.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X