టిడిపికి ప్రశాంత్ కిశోర్ హడల్: అంతా ఆయనే, జగన్‌ది యాక్షన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తన వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌ను ఎంపిక చేసుకోవడం తెలుగుదేశం పార్టీ నాయకులను కలవరపరుస్తున్నట్లే అనిపిస్తోంది.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తన వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌ను ఎంపిక చేసుకోవడం తెలుగుదేశం పార్టీ నాయకులను కలవరపరుస్తున్నట్లే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, మంత్రి నారా లోకేష్ నుంచి ఇతర టిడిపి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే ఆ అభిప్రాయం కలుగుతోంది.
ప్రశాంత్ కిశోర్‌ను జగన్ ఎంపిక చేసుకోవడంపై గమ్మత్తయిన వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ టిడిపి అనుకూల వర్గం నుంచి అటువంటి వ్యాఖ్యలు చోటు చేసుకుంటాయి. ప్రశాంత్ కిశోర్‌ను ఎంపిక చేసుకున్న విషయాన్ని ప్లీనరీలో ప్రకటిస్తూ ఆయనను అందరికీ జగన్ పరిచయం చేయడాన్ని హేళన చేస్తూ వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి.
Recommended Video

ప్రశాంత్ కిశోర్ చెప్పినట్లు నడుచుకుంటానని జగన్ చెప్పడాన్ని ఏద్దేవా చేస్తున్నారు. అలా చెప్పే జగన్ నాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్‌ను చూపి జగన్‌ను తక్కువ చేసే విధంగా మాట్లాడుతున్నారు. తనను క్యాడర్ నమ్మడం లేదని, అందువల్లనే జగన్ ప్రశాంత్ కిశోర్‌ను నమ్మాలని చెబుతున్నారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే టిడిపి వర్గాలు ఏదో మేరకు కలవరానికి గురవుతున్నాయనే చెప్పడానికి వీలుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆ భవనమంతా ప్రశాంత్ కిశోర్‌దే...
హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో గల పాత సాక్షి కార్యాలయ భవనం మొత్తాన్ని జగన్ ప్రశాంత్ కిశోర్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ భవనంలో సాక్షి జర్నలిజం స్కూల్ నడిచేది. దాన్ని కూడా అక్కడి నుంచి తరలిస్తున్నట్లు సమాచారం. మొత్తం ఇక్కడి నుంచే ప్రశాంత్ కిశోర్ పనిచేస్తారని అంటున్నారు.

మందీమార్బలం....
ప్రశాంత్ కిశోర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసేందుకు 300 నుంచి 500 మందిని నియోగించుకుంటారని అంటారు. వారంతా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికిప్పుడు అంచనా వేస్తుంటారని, డేటాను తెప్పించుకుని విశ్లేషిస్తారని అంటున్నారు. ఎక్కడ పార్టీ బలహీనంగా ఉంది, ఎక్కడ మార్పులు అవసరం వంటి వివిధ వి,,యాలను మండల, గ్రామస్థాయి వరకు విశ్లేషిస్తారని చెబుతున్నారు.

ప్రాంతాలవారీగా, సామాజిక వర్గాల వారీగా....
ప్రశాంత్ కిశోర్ బృందం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని సామాజిక వర్గాల సమీకరణను అంచనా వేస్తుందని చెబుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇతర కోస్తా ప్రాంతాలను విడివిడిగా తీసుకుని సామాజిక వర్గాల సమీకరణ చేస్తారని అంటున్నారు. నియోజకవర్గాల వారీగా సామాజిక సమీకరణాలను అంచనా వేసి, అభ్యర్థులను కూడా ప్రశాంత్ కిశోర్ ఎంపిక చేస్తారని అంటున్నారు. టికెట్ల ఖరారు విషయంలో నిర్మొహమాటంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

జగన్ యాక్షన్ మాత్రమే....
అభ్యర్థుల ఎంపిక వంటి అన్ని వ్యవహారాలు ప్రశాంత్ కిశోర్ చక్కబెడుతున్న నేపథ్యంలో వైయస్ జగన్ అందుకు అనుగుణంగా కార్యాచరణకు దిగుతారని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ చెప్పిన రీతిలోనే జగన్ కార్యక్రమాలుంటాయని అంటున్నారు. షర్మిల, విజయమ్మలు ప్రచార సారథులుగా వ్యవహరించే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

ఎప్పటికప్పడు అలా....
తెలుగుదేశం, ఇతర పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలను తిప్పికొట్టడానికి అవసరమైన ప్రతివ్యూహాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రశాంత్ కిశోర్ బృందం అందిస్తుందని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ చేసే సూచనలను పాటించడానికి అవసరమైన యంత్రాంగాన్ని కూడా జగన్ సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications