విజయవాడలో ఏబీవీకి మద్దతుగా రంగంలోకి జగన్ విధేయ ఐఏఎస్ అధికారి..!!

స్థానిక ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారాయి. మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పుడు విజయవాడ మేయర్ ఎన్నిక ఆసక్తిగా మారుతోంది. అక్కడ కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు సీటు కేటాయించారు. వంగవీటి రాధా బరిలో ఉన్నారు. కాగా.. స్వతంత్ర అభ్యర్దిగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వ రరావు పోటీ చేస్తుండటం ఆసక్తి గా మారింది. అమితే, ఏబీవీకి మద్దతుగా ఇప్పుడు జగన్ వద్ద కీలకం గా పని చేసిన ఐఏఎస్ అధికారి రంగంలోకి దిగారు.

విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల ఫైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. విజయవాడ మేయర్ రేసులో కూటమి నుంచి వంగవీటి రాధా, వైసీపీ నుంచి రాయన భాగ్యలక్ష్మి పోటీలో ఉండ గా.. ఇండియా కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్దిగా ఏబీ వెంకటేశ్వర రావు బరిలోకి దిగారు. ఆయనకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఏబీవీ తన ప్రచారంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. విజయవాడలో సుదీర్ఘ కాలం పని చేసిన తనకు నగరానికి ఏం చేయాలో పూర్తి అవగాహన ఉందని.. తన ఆలోచనలతో మేనిఫెస్టో ప్రకటించారు. కాగా.. ఇప్పుడు ఏబీవికి మద్దతుగా జగన్ సీఎంగా ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి రంగంలోకి వచ్చారు. ఏబీవీ ని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. విజయవాడకు ఏబీవీకి ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ... ఆయన సమర్థతను ప్రజలకు వివరిస్తున్నారు.

జనసేనకు దక్కే జెడ్పీ స్థానాలు - ఎవరు ఎక్కడ, లిస్టులో..!?
జనసేనకు దక్కే జెడ్పీ స్థానాలు - ఎవరు ఎక్కడ, లిస్టులో..!?
praveen-prakash-backs-ab-venkateswara-rao-in-vijayawada-mayor-election-here-the-details

ఏబీవీకి మద్దతుగా ప్రవీణ్ ప్రకాశ్

మాజీ సీఎం జగన్ వద్ద కీలకంగా వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాశ్ ఇప్పుడు ఏబీవీకి మద్దతుగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. జగన్ హాయంలో ప్రవీణ్ ప్రకాశ్ కీలకంగా వ్యవహరించారు. తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ హయాంలో నాడు ఏబీవీ పైన తీసుకున్న నిర్ణయాల్లోనూ ప్రవీణ్ ప్రకాశ్ కీలకంగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ నేతగా ఏబీవీకి మద్దతుగా నిలిచారు. విజయవాడలో తాను పని చేసిన సమయంలోనే ఏబీవీ ఐపీఎస్ గా సేవలు అందించారని... ఆయనకు స్థానిక అంశాల పైన పూర్తి అవగాహన ఉందని ప్రవీణ్ ప్రకాశ్ చెప్పుకొచ్చారు. విజయవాడ వాసులు ఏబీవీకి మద్దతుగా నిలవాలని సూచన చేసారు. ప్రవీణ్ ప్రకాశ్ విజయవాడ ఎన్నికల్లో ఏబీవీకి మద్దతుగా ఇచ్చిన సందేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+