కేసీఆర్ నజరానా: ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉధ్యోగుల వేతన సవరణను (పీఆర్సీ) ప్రకటించింది. ఉద్యోగుల వేతన ఫిట్మెంటును 43 శాతంగా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటన పైన ఉద్యోగాల సంఘాలు హర్ష్యం వ్యక్తం చేశాయి. 2014 జూన్ 2 నుండి ఫిట్మెంట్ వర్తిస్తుంది. దీనిపై రేపు ఉత్తర్వులు జారీ చేయనుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం పీఆర్సీపై మాట్లాడారు. ఉద్యోగుల బకాయిలు జీపీఎఫ్‌లో జమ అవుతాయని చెప్పారు. పెరిగిన వేతనాలు మార్చి నుండి చెల్లిస్తామని చెప్పారు. జూన్ 30న రిటైరైన వారికి ఫిట్మెంట్ వర్తిస్తుందని చెప్పారు. సకల జనుల సమ్మె సమయంలో ఉద్యోగులు ముందున్నారని చెప్పారు.
పీఆర్సీ అమలుతో ఖజానాకు రూ.6,500 కోట్ల భారం పడనుందని చెప్పారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉద్యోగులు, అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఉద్యోగుల సర్వీస్ రూల్ సరళ తరం చేస్తామని చెప్పారు.
ఉద్యోగ సంఘాల హర్షం
ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించినందుకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి. ఉద్యోగ సంఘాల ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశంలోనే ఇలాంటి సీఎంను మొదటిసారి చూస్తున్నామన్నారు. ఏపీ ఏర్పడక ముందు తెలంగాణ ఉద్యోగుల జీతాలు ఎక్కువగా ఉండేవని, తెలంగాణ ఏర్పడిన తర్వాత వేతనాలు తగ్గాయని చెప్పారు.












Click it and Unblock the Notifications