APలో 173 ఒక ఎత్తు.. ఆ 2 మరో ఎత్తు!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఏకైకా రాజధానిగా అమరావతి ఉంటుందని, అదే తమ పార్టీ నినాదమని స్పష్టత ఇస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్లబోతున్నారు. రాష్ట్రంలోని ఐదున్నర కోట్ల ప్రజలు ఒక రాజధానివైపు మొగ్గుచూపుతున్నారా? మూడు రాజధానులవైపు మొగ్గుచూపుతున్నారా? అనే విషయం ఫలితాలొస్తేకానీ వెల్లడయ్యే అవకాశం లేదు.

డొక్కా కానీ లేదంటే కత్తెర సురేష్

డొక్కా కానీ లేదంటే కత్తెర సురేష్


ముఖ్యమంత్రి జగన్ అమరావతి పరిధిలో ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను భారీ మెజారిటీతో గెలుచుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ రెండింటినీ వైసీపీ గెలుచుకుంది. తాడికొండలో రిజర్వుడు నియోజకవర్గంలో ఉండవల్లి శ్రీదేవి గెలవగా, మంగళగిరి నుంచి నారా లోకేష్ మీద ఆళ్ల రామకృష్ణా రెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం ఉండవల్లి శ్రీదేవి మీద నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో అక్కడ అభ్యర్థిని మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ లేదంటే కత్తెర సురేష్ కుమార్ కానీ అవుతారని వైసీపీ వర్గాలంటున్నాయి.

సత్తెనపల్లికి ఆళ్ల

సత్తెనపల్లికి ఆళ్ల


మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీచేయడం ఖాయమవడంతోపాటు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆయన చుట్టివస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి పంపించి ఇటీవలే పార్టీలోకి వచ్చిన టీడీపీ నాయకుడు గంజి చిరంజీవిని అభ్యర్థిగా నిలపాలని జగన్ యోచిస్తున్నారు. పట్టణంలో పద్మశాలీ వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉండటంతో వాటిని దక్కించుకునే కచ్చితంగా గెలుపొందగలమని ఆయన భావిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలను దక్కించుకోగలిగితే ప్రజలంతా మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్నారని, అమరావతి ప్రాంత ప్రజలు కూడా మూడు రాజధానులవైపు మొగ్గుచూపుతున్నారని చెప్పుకోవడానికి భాగుంటుందని జగన్ అంచనా.

రెండు పార్టీల మధ్య హోరాహోరీ

రెండు పార్టీల మధ్య హోరాహోరీ


వచ్చే ఎన్నికలు వైసీపీ, తెలుగుదేశం మధ్య హోరాహోరీగా జరగబోతున్నాయి. ప్రతి ఓటు అత్యంత విలువైంది. ఈ విషయం ఇరు పార్టీల అధినేతలకు తెలుసు. అందుకే ఏ చిన్న అవకాశాన్ని వారు వదులుకోవడంలేదు. మూడు రాజధానులే నినాదంగా ఎన్నికలకు వెళ్లబోతున్న వైసీపీ మరింత అప్రమత్తంగా ఉంది. రెండు నియోజకవర్గాల్లో ప్రయోగాలు చేసైనా, లేదంటే కొత్త అభ్యర్థులను బరిలోకి దింపైనా సరే విజయం సాధించాలనే దృక్పథంతో జగన్ ఉన్నారు. ఓటర్లు ఎటువంటి తీర్పునిస్తారో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+