హైదరాబాద్‌లో రాష్ట్రపతికి ఘన స్వాగతం (పిక్చర్స్)

హైదరాబాద్: శీతాకాలం విడిది కోసం రాష్ట్రప్రతి ప్రణబ్ ముఖర్జీ గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. హకీంపేట్ విమానాశ్రయంవద్ద ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు, ముఖ్యనేతలు స్వాగతం పలికారు. రాష్ట్రపతి అక్కడి నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి అతిథి భవన్‌కు బయలుదేరారు. ఈ నెల 31వ తేదీ వరకు ఆయన ఇక్కడే ఉంటారు.

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి రెండు వారాలు బస చేయడం సంప్రదాయంగా వస్తోదంి. ఇక్కడి నుంచే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని, ఇతర రాష్ట్రాల్లో పర్యటించి తిరిగి హైదరాబాదుకే వస్తారు. ఆయన ఈ పర్యటనలన్నీ హెలికాప్టర్‌లోనే చేస్తారని సమాచారం. ఆయన రేపు శుక్రవారం చెన్నైలో పర్యటిస్తారు. తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఆయన హైదరాబాదులో విడిది చేస్తూ అలహాబాద్, ఆగ్రా, ముంబైల్లో కూడా పర్యటిస్తారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును నిరసిస్తున్న సమైక్యవాదుల నుండి నిరసనల వ్యక్తమయ్యే అవకాశం ఉండడంతో ప్రణబ్ పర్యటన సజావుగా సాగేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరేందుకు సీమాంధ్ర నేతలు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని కోరేందుకు తెలంగాణ నేతలు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు.

రాష్ట్రపతికి స్వాగతం ఇలా..

రాష్ట్రపతికి స్వాగతం ఇలా..

సికింద్రాబాద్ హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి హైదరాబాద్ మేయర్ ఇలా స్వాగతం చెప్పారు. మంత్రి గీతారెడ్డిని చిత్రంలో చూడవచ్చు.

రాష్ట్రపతితో మహంతి ఇలా..

రాష్ట్రపతితో మహంతి ఇలా..

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి స్వాగతం చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి మహంతి.

రాష్ట్రపతికి గవర్నర్ స్వాగతం..

రాష్ట్రపతికి గవర్నర్ స్వాగతం..

హైదరాబాద్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇలా ఆహ్వానించారు. రాష్ట్రపతికి ఈ నెల 24వ తేదీన గవర్నర్ రాజభవన్‌లో విందు ఇస్తున్నారు.

అనంతపురంలో ఈ నెల 23న..

అనంతపురంలో ఈ నెల 23న..

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 23వ తేదీన అనంతపురంలో జరిగే మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.

రాష్ట్రపతికి ముఖ్యమంత్రి స్వాగతం

రాష్ట్రపతికి ముఖ్యమంత్రి స్వాగతం

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇలా స్వాగతం చెప్పారు. పక్కన గవర్నర్‌ను చూడవచ్చు.

రాష్ట్రపతికి ఉప ముఖ్యమంత్రి స్వాగతం..

రాష్ట్రపతికి ఉప ముఖ్యమంత్రి స్వాగతం..

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఇలా స్వాగతం చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి నవ్వుతున్న చిత్రాన్ని చూడవచ్చు. శాసనమండలి చైర్మన్ చక్రపాణిని కూడా చిత్రంలో చూడవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+