వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయమ్మకు నో చెప్పిన రాజ్, ప్రణబ్ ఊరట (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, తదితరులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బుధవారం కలిశారు. పార్టీ నాయకులతో కలిసి కలిసి బుధవారం ఆమె ప్రణబ్, రాజ్‌నాథ్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు.

అనంతరం విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించొద్దని రాష్ట్రపతిని కోరామని, రాజ్యాంగం ప్రకారం తీసుకోవాల్సిన చర్యల్ని తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు సహకరించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా కోరామని, అయితే తమ పార్టీ ఇప్పటికే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని ఆయన సమాధానం ఇచ్చారన్నారు.

మరోవైపు హైదరాబాదులో బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో జరిగిన ఎపిఎన్జీవో చర్యలు విఫలమయ్యాయి. అనంతరం ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ సమ్మె కొనసాగిస్తామని చెప్పారు.

రాజా

రాజా

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నేతృత్వంలో లెఫ్ట్ పార్టీ నేత రాజాను కలిసిన దృశ్యం.

రాజ్‌నాథ్ సింగ్

రాజ్‌నాథ్ సింగ్

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నేతృత్వంలో బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన దృశ్యం.

వైయస్ విజయమ్మ

వైయస్ విజయమ్మ

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ.

రాష్ట్రపతి భవన్

రాష్ట్రపతి భవన్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం భవనం నుండి బయటకు వస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, ఇతర నేతలు.

రాష్ట్రపతికి వినతి పత్రం

రాష్ట్రపతికి వినతి పత్రం

సమైక్యాంధ్ర కోసం కృషి చేయాలని రాష్ట్రపతికి వినతి పత్రం ఇస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, ఇతర నేతలు.

ఎపిఎన్జీవో

ఎపిఎన్జీవో

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో బుధవారం చర్చల అనంతరం సచివాలయం నుండి వర్షంలో బయటకు వస్తున్న ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు, ఇతరులు.

ఎపిఎన్జీవో 2

ఎపిఎన్జీవో 2

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో బుధవారం చర్చల అనంతరం సచివాలయం నుండి వర్షంలో బయటకు వస్తున్న ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు, తదితరులు.

ఎపిఎన్జీవో 3

ఎపిఎన్జీవో 3

సమ్మెపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చల అనంతరం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు.

English summary

 YSR Congress Party honorary president YS Vijayamma, along with MPs and MLAs and others called on Presidnet Pranabh Mukherjee to discuss the Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X