ఆందోళన: శ్వేతాబసు విడుదల కోసం ప్రయత్నాలు?
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి శ్వేతాబసు సెక్స్ రాకెట్‌లో కొద్ది రోజుల క్రితం దొరికిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం రెస్క్యూ హోంలో ఉంటున్నారు. అయితే, శ్వేతను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయించేందుకు ఒత్తిళ్లు, ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఆమె అందులోనే తమ పేర్లు బయటపడవచ్చుననే ఆందోళనలు కొందరిలో ఉండవచ్చుననే వార్తలు వస్తున్నాయి.
శ్వేతాబసు ఎక్కువకాలం అక్కడే ఉంటే పలువురి పేర్లు బయటకు రావొచ్చునని, అందుకే త్వరగా విడుదల చేయిస్తే ఆమెను మౌనంగా ఉంచవచ్చునని, ఈ కారణంగానే విడుదల కోసం ఒత్తిళ్లు వస్తున్నట్లుగా కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. శ్వేతాబసు వ్యవహారంలో ఉన్న వారు ప్రముఖులైన వారే ఉంటారని చెబుతున్నారు.
శ్వేతాబసు ప్రసాద్ సెక్స్ రాకెట్‌లో కొద్ది రోజుల క్రితం దొరికిన విషయం తెలిసిందే. ఆమెను పోలీసులు కోర్టుకు హాజరుపర్చారు. ఆమె ప్రస్తుతం రెస్క్యూ హోంలో ఉంటున్నారు. శ్వేతాబసు వ్యవహారం బయటపడిన తర్వాత పలువురు తారలు ఆమెకు అండగా నిలిచారు.

ఇదిలా ఉండగా, తన కూతురును అప్పగించాలని శ్వేతాబసు తల్లి నెలన్నర క్రితం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇక నుంచి తమ కుమార్తెను జాగ్రత్తగా చూసుకుంటామని, ఆమెను వెన్నంటి ఉంటానని ఆమె కోర్టుకు తెలిపారు. దీంతో జడ్జి శ్వేతబసును కూడా విచారించారు. అమె తల్లితో వెళ్లేందుకు అంగీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ, శ్వేత మరికొద్ది నెలలు రెస్క్యూ హోంకే పరిమితమయ్యారు.
కాగా, శ్వేతబసు ప్రసాద్ మంచి ఫొటోగ్రాఫర్ కూడా. రూమీ అనే పర్షియన్ కవికి ఆమె అభిమాని. హైదరాబాదులోని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ఆమె గతంలో తాను తీసిన ఫొటోలతో ఓ ప్రదర్శన నిర్వహించింది. దైనందిన జీవితానికి, ప్రకృతికి సంబంధించి ఆమె అందమైన ఛాయాచిత్రాలు తీసింది.
తన షోకు ఆమె రూమీ అని పేరు పెట్టుకుంది. ప్రతి ఫోటో కింద రూమీ స్టాంజాలను ఇచ్చారు. 2012 నవంబర్‌లో ఆమె ఛాయాచిత్రాల ప్రదర్శన జరిగింది. సినీ పరిశ్రమకు రాక ముందు ఆమెకు ఫొటోగ్రఫీ ఓ హ్యాబీ, ఫ్యాషన్ కూడా. పర్యటనలకు వెళ్లినప్పుడు సరదాగా అహ్లాదకరమైన చిత్రాలను తన కెనన్ డి 1000 కెమెరాలో బంధించారు.
శ్వేత కుటుంబ సభ్యులు ఆ చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. రూమీ 13వ శతాబ్దానికి చెందిన కవి. ఆయన రచనలు తనకు ఎంతో ఇష్టమని ఆమె అప్పట్లో చెప్పారు. రూమీ 805వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫోటో ప్రదర్శనను పెట్టారు. ఈ ఫొటోగ్రఫీ ప్రదర్శనకు వచ్చిన డబ్బును హీల్ చిల్డ్రన్ చారిటీకి విరాళంగా ఇచ్చారు.












Click it and Unblock the Notifications