విజయవాడ: పొట్లూరికోసం బాబుపై పవన్, జయ ఒత్తిడి?
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్‌కు విజయవాడ లోకసభ సీటు ఇవ్వాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి తెస్తున్నారని టిడిపిలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోందని ప్రచారం జరుగుతోంది.
రెండు రోజులుగా విజయవాడ లోకసభ టిక్కెట్ పైన టిడిపిలో ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. విజయవాడ లోకసభ తనదేనని భావించి టిడిపి నేత కేశినేని నాని జోరుగా ప్రచారం చేశారు. బిజెపి-టిడిపి పొత్తు, పవన్ మద్దతు నేపథ్యంలో పొట్లూరి పేరు తెర పైకి రావడం చంద్రబాబుకు తలబొప్పి కట్టిస్తోందంటున్నారు.

పొట్లూరి వర ప్రసాద్‌కు విజయవాడ లోకసభ టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబుకు పవన్‌తో పాటు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితల నుండి కూడా ఒత్తిళ్లు వస్తున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలువురు పారిశ్రామికవేత్తలు కూడా పొట్లూరి కోసం పట్టుబడుతున్నారట. ఇది బాబుకు తలనొప్పి కలిగిస్తోందంటున్నారు.అయితే, చంద్రబాబు నాని వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు.
కేశినేనికే ఇవ్వాలని స్థానిక నేతలు
విజయవాడ లోకసభ టిక్కెట్ విషయంలో తెలుగుదేశం పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే స్థానిక నాయకులు, కార్యకర్తలు మాత్రం కేశినేని నానికే ఇవ్వాలని పట్టుబడుతున్నారు.












Click it and Unblock the Notifications