దసరా పండుగ నాడే తీవ్ర విషాదం.. ఆలయంలోనే కుప్పకూలిన అర్చకుడు !!
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలన్ని భక్తులు కిటకిటలాడుతున్న వేళ.. అమ్మవారి సేవలో తరించిపోతున్న ఒక అర్చకుని అకస్మాత్తు మరణం నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం నింపుతోంది. సర్వవాడలోని శ్రీవెంకమాంబ దేవస్థానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పండుగ నాడు ఆనందోత్సాహాలతో పరిస్థితుల్లో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అమ్మ సేవలోనే..
కాగా ఆలయంలో ప్రధాన అర్చకునిగా సురేష్ స్వామి ఉన్నారు. విజయదశమి పండుగ కావడంతో, ఆయన ఉదయం నుంచే ప్రత్యేక పూజల్లో లీనమయ్యారు. పట్టు వస్త్రాలు ధరించి, ఎంతో భక్తితో అమ్మవారికి హారతి ఇస్తూ, తీర్థప్రసాదాలను భక్తులకు పంచుతున్నారు.

అయితే భక్తులకు ప్రసాదం అందిస్తుండగానే, సురేష్ స్వామి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. క్షణాల్లో జరిగిన ఈ ఊహించని పరిణామంతో ఆలయంలోని భక్తులు, ఇతర సిబ్బంది దిగ్భ్రాంతికి లోనయ్యారు. భక్తి నిండిన ఆలయం ఒక్కసారిగా శోక సంద్రంగా మారింది.
సురేష్ స్వామి పడిపోవడంతో ఆలయంలో గందరగోళం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన భక్తులు, ఆలయ సిబ్బంది ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే జరగాల్సిన విషాదం జరిగిపోయింది. ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించడంతో కుటుంబ సభ్యులు, ఆలయ సిబ్బంది కన్నీరుమున్నీరుగా విలపించారు.
పవిత్రమైన పండుగ రోజున, సాక్షాత్తూ అమ్మవారి సన్నిధిలోనే, ఆమె సేవ చేస్తుండగానే ఆయన పరమపదించడం.. ఆయన అదృష్టం, కానీ మా దురదృష్టం" అంటూ స్థానికులు, భక్తులు కన్నీటితో ఆ అర్చక స్వామికి వీడ్కోలు పలుకుతున్నారు. ఈ సంఘటన ఆలయ ప్రాంగణంలో ఒక హృదయ విదారక జ్ఞాపకంగా మిగిలిపోయింది.












Click it and Unblock the Notifications