విశాఖపట్నం, తిరుపతికి మోడీ అంకుల్ శుభవార్త
విశాఖపట్నం నుంచి బెంగళూరు, సికింద్రాబాద్, తిరుపతికి తిరుగుతున్న ప్రత్యేక రైళ్లను భారతీయ రైల్వే అధికారులు పొడిగించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వీటిని పొడిగించాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం లభించే ఆదరణను బట్టి భవిష్యత్తులో వీటిని నడిపించాలా? లేదా? అనే నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు.
నెంబర్ 08579 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. మార్చి 27 వరకు పొడిగించారు. విశాఖపట్నంలో రాత్రి 7.00 గంటలకు బయలుదేరి తర్వాతరోజు ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

నెంబర్ 08580 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. మార్చి 28 వరకు పొడిగించారు. సికింద్రాబాద్‌లో రాత్రి 7.40 గంటలకు బయలుదేరి తర్వాతరోజు ఉదయం 9.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
మార్గమధ్యంలో ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది.
నెంబర్ 08583 విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. మార్చి 25 వరకు పొడిగించారు. విశాఖపట్నంలో రాత్రి 7.10 గంటలకు బయలుదేరి తర్వాతరోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
నెంబర్ 08584 తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. మార్చి 25 వరకు పొడిగించారు. తిరుపతిలో రాత్రి 9.55 గంటలకు బయలుదేరి తర్వాతరోజు ఉదయం 10.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ రైలు మార్గమధ్యంలో దువ్వాడ, అనాకపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.












Click it and Unblock the Notifications